భారతదేశంలో రెండవ అతిపెద్ద టెలికాం సర్వీస్ ప్రొవైడర్ అయిన భారతీ ఎయిర్‌టెల్‌కు టెలికమ్యూనికేషన్స్ విభాగం రూ.2.14 లక్షల జరిమానా విధించింది. కర్ణాటక టెలికాం సర్కిల్లోని సబ్‌స్క్రైబర్ వెరిఫికేషన్ నియమాలను పాటించడంలో టెలికాం విఫలమైనందున ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. అవసరమైన ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయకుండానే కంపెనీ సిమ్ కార్డులను జారీ చేసిందని, ఇది దాని లైసెన్స్ షరతులను ఉల్లంఘించడమేనని DoT వెల్లడించింది. Also Read:CM Chandrababu: విజయవాడ వీధుల్లో సీఎం చంద్రబాబు కాలి నడక.. చిరు […]
ఐసిసి ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2025లో భాగంగా ఈరోజు ఇంగ్లాండ్ తో భారత్ తలపడుతుంది. ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ ఇండోర్ లోని హోల్కర్ స్టేడియంలో జరుగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. భారత్ కు 289 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి కీలక మ్యాచ్‌లో తన సత్తా చాటింది. ఇంగ్లాండ్‌పై 54 బంతుల్లోనే […]
బైక్, స్కూటర్లపై ఫ్యామిలీ అంటే ఓ నలుగురు కూర్చోని ప్రయాణించడమంటే ఇబ్బందిగా ఉంటుంది. కానీ, ఇప్పుడు ఆ చింత లేదు. భారతదేశపు మొట్టమొదటి ఫ్యామిలీ SUV స్కూటర్ విడుదలైంది. ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీదారు కోమాకి FAM1.0, FAM2.0 అనే రెండు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఇవి దేశంలోనే మొట్టమొదటి SUV స్కూటర్లు అని కంపెనీ పేర్కొంది. ఈ స్కూటర్లు ప్రత్యేకంగా కుటుంబ ప్రయాణం కోసం రూపొందించినట్లు తెలిపింది. ఇది సౌకర్యవంతంగా ఉండడమే కాక ఖర్చులను […]
భారత్ కీలక పురోగతిని సాధించింది. దేశం తన మొట్టమొదటి స్వదేశీ యాంటీబయాటిక్, నాఫిథ్రోమైసిన్‌ను అభివృద్ధి చేసింది. ఇది ప్రాణాంతక శ్వాసకోశ ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో అత్యంత ప్రభావవంతమైనదని నిపుణులు చెబుతున్నారు. ఇది ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు, మధుమేహం ఉన్నవారికి ఆశాకిరణంగా మారుతుందని తెలిపారు. ఈ యాంటీబయాటిక్ పూర్తిగా భారతదేశంలోనే రూపొంది, అభివృద్ధి అయి, క్లినికల్‌గా పరీక్షించబడిందని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. ఔషధ రంగంలో భారతదేశాన్ని స్వావలంబన చేయడంలో ఇది […]
ఓ వైపు కల్తీ ఫుడ్డుతో బెంబేలెత్తుతుంటే.. మరోవైపు తిని పడేసిన ఫుడ్ కంటెయినర్స్ ను మళ్లీ క్లీన్ చేసి వాటిలోనే ఫుడ్ ప్యాకింగ్ చేస్తున్నారు క్యాటెరింగ్ సిబ్బంది. ఈ తతంగాన్నంతా వీడియో తీసిన ఓ ప్రయాణికుడు సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. అందులో, ఒక వ్యక్తి ప్యాక్ చేసిన ఆహారం కోసం ఉపయోగించే డిస్పోజబుల్ పాత్రలను కడుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ విషయంలో ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) చర్యలు […]
సరదాకోసమని వెర్టిగో రైడ్ ఎక్కితే ప్రాణం పోగొట్టుకునేంత పనైంది. 100 అడుగుల ఎత్తులో వెర్టిగో రైడ్ ఆగిపోవడంతో డజన్ల కొద్ది ప్రయాణికులు గాల్లో బిక్కు బిక్కుమంటూ గడిపారు. నార్త్ కరోలినా స్టేట్ ఫెయిర్‌లో సాంకేతిక లోపం కారణంగా ఒక రైడ్ అకస్మాత్తుగా ఆగిపోయింది. పీపుల్‌లో వచ్చిన నివేదిక ప్రకారం, లో-వోల్టేజ్ సమస్య కారణంగా వెర్టిగో రైడ్ పనిచేయకపోవడం వల్ల ప్రయాణికులు గాలిలో చిక్కుకుపోయారని వెల్లడించింది. Also Read:IND vs AUS: టీమిండియా ఘోర ఓటమి.. 21 ఓవర్లలో […]
ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE మెయిన్స్) 2026 తేదీలను ఖరారు చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇంజనీరింగ్ పరీక్ష మొదటి దశ జనవరి 21-30, 2026 మధ్య నిర్వహించబడుతుందని నిర్ణయించింది. రెండవ దశ పరీక్ష ఏప్రిల్ 1-10 తేదీలలో జరగనుంది. అయితే, దరఖాస్తు ప్రక్రియ షెడ్యూల్ ఇంకా పెండింగ్‌లో ఉంది. JEE మెయిన్ ఫేజ్ 1 పరీక్షకు ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ దాదాపు అక్టోబర్ 25వ తేదీన ప్రారంభమవుతుందని, ఫేజ్ […]
NTPC మైనింగ్ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మైన్ సర్వేయర్ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 21 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎగ్జిక్యూటివ్ (ఫైనాన్స్) పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి, గుర్తింపు పొందిన సంస్థ నుండి గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉండాలి. CA లేదా CMA ఉత్తీర్ణులై ఉండాలి. ఎగ్జిక్యూటివ్ (ఎన్విరాన్మెంటల్ మేనేజ్మెంట్) పోస్టుకు ఎంపికైన అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో ఎన్విరాన్మెంట్ సబ్జెక్టులో బ్యాచిలర్ ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండాలి. అసిస్టెంట్ మైన్ సర్వేయర్ […]
పండగవేళ విషాదం చోటుచేసుకుంది. ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ నుంచి బీహార్ వెళ్తున్న కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్‌కు కొద్ది దూరంలో ముగ్గురు ప్రయాణికులు రైలు నుండి పడిపోయారు. ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న నాసిక్ రోడ్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, భూసావల్ వెళ్లే ట్రాక్‌లోని 190/1, 190/3 కిలోమీటరు మధ్య ఈ ప్రమాదం […]
భారత్, చైనా మధ్య విమాన కనెక్టివిటీ తిరిగి ప్రారంభం కానుంది. చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ నవంబర్ 9 నుంచి షాంఘై, న్యూఢిల్లీ మధ్య రౌండ్-ట్రిప్ విమానాలను ప్రారంభించనుంది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య సంబంధాలను బలపరిచే దిశగా ఒక కీలక అడుగుగా పరిగణిస్తున్నారు. షాంఘై, ఢిల్లీ మధ్య ప్రతి బుధ, శని, ఆదివారాల్లో ఈ విమానం నడుస్తుందని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ విమానం షాంఘైలోని పుడాంగ్ విమానాశ్రయం నుండి మధ్యాహ్నం 12:50 గంటలకు బయలుదేరి సాయంత్రం […]