20 బంతుల్లో 5 వికెట్లు.. Rashid Khan మ్యాజిక్.. MI లండన్ విజయం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rashid Khan: ది హండ్రెడ్ 2026 టోర్నమెంట్లో అఫ్గానిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 5 వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు. ఎంఐ లండన్ తరఫున ఆడుతున్న రషీద్.. మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ పై స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటర్లను కట్టడి చేశాడు. దీనితో ఎంఐ లండన్ 46 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
ఆదివారం (ఆగస్టు 2) జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ లండన్ నిర్ణీత 100 బంతుల్లో 183 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆ తర్వాత 184 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ సూపర్ జెయింట్స్‌ను రషీద్ ఖాన్ తన స్పిన్‌తో కుదేలు చేశాడు. తన నిర్ణిత 20 బంతుల్లో కేవలం 17 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇది ది హండ్రెడ్ టోర్నమెంట్లో రషీద్ ఖాన్‌కు తొలి ఐదు వికెట్ల ప్రదర్శన మాత్రమే కాకుండా.. ఈ లీగ్‌లో అతని కెరీర్లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ఫిగర్స్.
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
- Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
- India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
మ్యాచ్ అనంతరం మాట్లాడిన రషీద్ ఖాన్.. తన ప్రదర్శనపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ టోర్నమెంట్ ఇప్పటివరకు నాకు అంతగా కలిసిరాలేదు. అయితే నేను ఓర్పు కోల్పోకుండా నా బౌలింగ్‌పై దృష్టి పెట్టానని.. సరైన లైన్, లెంగ్త్‌లో బౌలింగ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడంతో మంచి ఫలితం వచ్చిందని తెలిపాడు. ఎంఐ లండన్ కెప్టెన్ సామ్ కరన్ రషీద్ ఖాన్ ప్రదర్శనపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. మ్యాచ్ తర్వాత కరన్ మాట్లాడుతూ.. రషీద్ 5 వికెట్లు తీశాడని స్క్రీన్‌పై చూసే వరకు నాకు కూడా తెలియలేదు. అతను ఎంత ప్రశాంతంగా తన పని పూర్తి చేస్తాడో ఈ ప్రదర్శనే దానికి నిదర్శనమని ప్రశంసించాడు.
రషీద్ ఖాన్ ఐదు వికెట్ల ధాటికి మాంచెస్టర్ సూపర్ జెయింట్స్ 95 బంతుల్లో 138 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఎంఐ లండన్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. అద్భుత బౌలింగ్‌కు గాను రషీద్ ఖాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ విజయంతో ఎంఐ లండన్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.
Here’s to you, Rashid Khan 🙌#MILondon 💙💚 pic.twitter.com/LE9DdRP1HE
— MI London (@MILondonCricket) August 2, 2026
తాజావార్తలు
-
Poco C95 Pro: పోకో C95 Pro లాంచ్.. 7500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా!
-
Punjab Drug Menace: నడవలేక తూలిపడిన 19 ఏళ్ల యువతి.. ‘జాంబీ డ్రగ్’పై మళ్లీ ఆందోళనలు.. పోలీసుల యాక్షన్
-
CJP Protest: సీజేపీ నిరసనలో తీవ్ర విషాదం.. ప్రొటెస్ట్‌కు వచ్చిన వ్యక్తి మృతి..
-
Astrology: అక్టోబర్ 03 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని గుడ్ న్యూస్..
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!