Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tata Cars: ఆటోమొబైల్ రంగంలో తన ప్రస్థానాన్ని మరింత బలపరుచుకొనేందుకు టాటా మోటార్స్ (Tata Motors) కొత్త వ్యూహంతో దూకుడును పెంచడానికి సిద్ధమైంది. రాబోయే నెలల్లో కంపెనీ పెట్రోల్, సీఎన్జీ, ఫ్లెక్స్-ఫ్యూయల్, ఎలక్ట్రిక్ విభాగాల్లో పలు కొత్త కార్లను మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. కొత్త Nexon వేరియంట్ల నుంచి ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్యూవీ Avinya X వరకు వివిధ కొత్త మోడళ్లను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
Tata Safari EV:
టాటా నుండి తొలి 7-సీటర్ ఎలక్ట్రిక్ SUV Safari EVను కూడా త్వరలో మార్కెట్లోకి తీసుకురానుంది. ఇది మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలకు గట్టి పోటీగా నిలవనుంది. ఈ SUVను Acti.EV+ ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో 65kWh, 75kWh బ్యాటరీ ప్యాక్‌లతో పాటు పెద్ద బ్యాటరీ ఆప్షన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఒకసారి పూర్తి ఛార్జ్ చేస్తే 550 నుంచి 600 కిలోమీటర్ల వరకు రేంజ్ అందించే అవకాశం ఉందని అంచనా. అలాగే ఇందులో అదనంగా ADAS, ఆటో పార్క్, 540-డిగ్రీ కెమెరా, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ వంటి ఆధునిక ఫీచర్లు ఉండనున్నాయి.
Also Read
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
- Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
- BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
Tata Nexon కొత్త వేరియంట్లు:
మారుతి బ్రెజ్జా ఫేస్‌లిఫ్ట్ విడుదలైన నేపథ్యంలో టాటా కూడా Nexonకు కొత్త వేరియంట్లను తీసుకురానుంది. వీటిని ఆగస్టు ప్రారంభంలో లాంచ్ చేసే అవకాశం లేకపోలేదు. కొత్త నెక్సాన్ (Nexon) కార్లు పెట్రోల్, CNG వేరియంట్లలో అందుబాటులోకి రావొచ్చు. వినియోగదారులకు మరింత విలువ అందించేలా ధరలు, ఫీచర్లలో మార్పులు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా CNG మోడల్లో బూట్ స్పేస్‌ను మెరుగుపరచనున్నట్లు సమాచారం.
Tata Punch Flex Fuel:
భారత మార్కెట్లో టాటా తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారుగా పంచ్ ఫ్లెక్స్ ఫ్యూయల్ (Punch Flex Fuel)ను తీసుకురానుంది. ఇది 2026 చివరి నాటికి లేదా 2027 ప్రారంభంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ మోడల్లో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను అందిస్తారు. ఇది E85 ఇంధనం (85% ఎథనాల్ + 15% పెట్రోల్)తో కూడా నడిచేలా ప్రత్యేకంగా రూపొందించనున్నారు. ఇందుకోసం ఇంజిన్, ఫ్యూయల్ సిస్టమ్‌లో కీలక మార్పులు చేయనున్నారు.
Tata Avinya X:
ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో అడుగుపెట్టేందుకు టాటా Avinya Xను సిద్ధం చేస్తోంది. ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రీమియం ఎలక్ట్రిక్ SUVగా రానుంది. ఈ SUVలో 5 మంది ప్రయాణించే సీటింగ్ సామర్థ్యం, ఆధునిక, ఫ్యూచరిస్టిక్ డిజైన్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, అనేక స్మార్ట్ ఫీచర్లు ఉండనున్నాయి. ఇందులో 65kWh నుంచి 80kWh వరకు బ్యాటరీ ప్యాక్‌లు అందించే అవకాశం ఉంది. భవిష్యత్తులో దీనికి 7-సీటర్ వెర్షన్ ను కూడా విడుదల చేసే ఆలోచనలో టాటా ఉంది.
Tata Tigor Facelift:
టాటా నుండి వస్తున్న Tigor సెడాన్‌కు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను కూడా విడుదల చేయనుంది. కొత్త మోడల్ డిజైన్ Tiagoను పోలి ఉండే అవకాశం ఉంది. ఈ కారు పెట్రోల్, CNG, ఎలక్ట్రిక్ మూడు వేరియంట్లలో రానుంది. పెట్రోల్ మోడల్లో 1.2 లీటర్ ఇంజిన్ ఉండగా, ఎలక్ట్రిక్ వెర్షన్లో ప్రస్తుతం ఉన్న 26kWh బ్యాటరీ ప్యాక్‌నే కొనసాగించే అవకాశం ఉంది. దీని రేంజ్ సుమారు 315 కి.మీ. ఉండొచ్చని భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!