Toxic Controversy: కియారాపై ట్రోలింగ్.. యశ్‌పై మౌనం.. ‘టాక్సిక్’ వివాదంపై ఘాటుగా స్పందించిన హుమా ఖురేషి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic Controversy: గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘టాక్సిక్’ యశ్‌కు ‘కేజీఎఫ్’ తర్వాత వస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలిచింది. ఇందులో కియారా అద్వానీతో పాటు నయనతార, తారా సుతారియా, రుక్మిణి వసంత్, హుమా ఖురేషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే సినిమా మీద ఎంత బజ్ ఏర్పడిందో అంతే వివాదాలను కూడా మూట గట్టుకుంటోంది ఈ మూవీ. ముఖ్యంగా బోల్డ్ సీన్స్ గురించి చాలా చోట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక బోల్డ్ సన్నివేశంలో ఇద్దరు నటులు నటిస్తే విమర్శలు మాత్రం ఒక్క మహిళకే ఎందుకు? ఇదే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. యశ్, కియారా అద్వానీ జంటగా నటించిన ‘టాక్సిక్’ లోని ‘తబాహి’ పాట విడుదలైన తర్వాత కియారా అద్వానీ తీవ్ర ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నారు. పెళ్లైన తర్వాత, తల్లి అయిన తర్వాత ఇలాంటి సన్నిహిత సన్నివేశాల్లో నటించడాన్ని కొందరు విమర్శిస్తుండగా, అదే సన్నివేశంలో నటించిన యశ్‌పై మాత్రం అలాంటి విమర్శలు లేకపోవడం మరోసారి చర్చను తెరపైకి తీసుకొచ్చింది.
ఈ వివాదంపై నటి హుమా ఖురేషి బహిరంగంగా స్పందించారు. ‘బీ ఏ మ్యాన్, యార్!’ టివి షో కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, కియారాను మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం పూర్తిగా తప్పని, అలాంటి ధోరణి అసహ్యకరమని ఆమె స్పష్టం చేశారు. ఈ సినిమాలో పనిచేసిన మహిళలు చివరికి తమ పనితోనే సమాధానం చెబుతారని, విమర్శలకు మాటలతో కాకుండా సినిమా ద్వారానే జవాబు లభిస్తుందని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోస్ట్ నిఖిల్ తనేజా కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పెళ్లైన యశ్ కంటే కియారా అద్వానీపైనే ఎక్కువ విమర్శలు రావడం ఎందుకని ప్రశ్నించగా, హుమా ఖురేషి సమాజంలో ఇప్పటికీ మహిళల పట్ల ఉండే వివక్షే దీనికి కారణమని స్పందించారు. నటిగా తన పని చేసినందుకు ఒక మహిళను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకోవడం సరైన సంస్కృతి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. హుమా సోదరుడు, నటుడు సాకిబ్ సలీమ్ కూడా ఈ వివాదంపై స్పందిస్తూ, నిజ జీవితంలో ప్రపంచం అంత చెడ్డది కాదని, కానీ సోషల్ మీడియా మాత్రం చాలా విషపూరితంగా మారిందని వ్యాఖ్యానించారు.
Also Read
‘తబాహి’ పాట విడుదలైనప్పటి నుంచి కియారా అద్వానీపై మాత్రమే కాకుండా ఆమె భర్త సిద్ధార్థ్ మల్హోత్రాపై కూడా ట్రోలింగ్ కొనసాగుతోంది. ఆయన సోషల్ మీడియా పోస్టుల కింద కూడా విమర్శాత్మక వ్యాఖ్యలు కనిపించాయి. సినిమా పాత్రకు సంబంధించిన అంశాన్ని వ్యక్తిగత జీవితంతో ముడిపెట్టి చర్చించడం సరైంది కాదని సినీ అభిమానుల్లో ఒక వర్గం అభిప్రాయపడుతోంది. ఇదే విషయంపై ఇంతకుముందు ‘టాక్సిక్’ చిత్రంలో నటిస్తున్న బ్రిటిష్ నటుడు బెనెడిక్ట్ గారెట్ కూడా కియారాకు మద్దతుగా నిలిచారు. యశ్‌కూ పెళ్లై పిల్లలు ఉన్నప్పటికీ ఆయనను ఎవరూ ప్రశ్నించడం లేదని, నటీనటుల పని పాత్రను నిజాయితీగా పోషించడం మాత్రమేనని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఆగస్టు 26న ఈ మూవీ రిలీజ్ తర్వాత ఈ వివాదాలకు తెరపడుతుందా, లేక మరింత చర్చకు దారితీస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తోలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
-
Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!