ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, శివసేన ఎంపీ సంజయ్ రౌత్, ఎన్ సీపీ-ఎస్ సీపీ ఎంపీ సుప్రియా సూలేతో కలిసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సంచలన ఆరోపణలు చేశారు రాహుల్ గాంధీ. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపించారు. లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని మార్చారని అన్నారు. రాష్ట్రంలో ఐదేళ్లలో 32 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారన్నారు. […]
ముడా భూమి స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు భారీ ఊరట లభించింది. ఈ కేసును సీబీఐ దర్యాప్తు కోరుతూ ఓ కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్ను కర్ణాటక హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది. లోకాయుక్త పోలీసుల దర్యాప్తు స్వతంత్రంగా ఉందని పేర్కొంది. ముడా ఇళ్ల స్థలాల కేసును సీబీఐకి అప్పగించాలని సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు ఆ పిటిషన్ ను కొట్టివేస్తూ కీలక తీర్పు వెలువరించింది. […]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రతి సంవత్సరం విద్యార్థులు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం అమెరికా వెళ్తుంటారు. ఉన్నత చదువులు చదివి అక్కడే ఉద్యోం సంపాదించి డాలర్లు సంపాదించాలని కలలుకంటుంటారు. అయితే కొంతమంది విద్యార్థులు తమ కలలను నెరవేర్చుకోకుండానే అసువులు బాస్తున్నారు. వివిధ కారణాలతో విద్యార్థులు మృత్యువాత పడుతున్నారు. దుండగుల కాల్పుల్లో కొందరు, రోడ్డు ప్రమాదాలు, వ్యక్తిగత కారణాలతో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా అమెరికాలోని న్యూయార్క్ లో తెలుగు విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తుమ్మేటి సాయికుమార్ రెడ్డి ఉరేసుకొని ఆత్మహత్య […]
వరుసగా మూడు రోజులు పెరిగిన బంగారం ధరలు నేడు శాంతించాయి. పసిడి ధరల్లో నేడు ఎలాంటి మార్పు లేదు. గోల్డ్ లవర్స్ కు ఇది ఊరటనిచ్చే విషయమనే చెప్పాలి. శుభకార్యాలకు, వివాహాది కార్యక్రమాలకు పసిడి కొనాలనుకునే వారు మళ్లీ ధరలు పెరగకముందే కొనుగోలు చేయడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పుత్తడి ధరలు ఓ రోజు పెరుగుతూ, ఆ తర్వాత స్వల్పంగా తగ్గుతూ, మరో రోజు స్థిరంగా కొనసాగుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మరి నేడు హైదరాబాద్ మార్కెట్ […]
శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా గుంటూరు జిల్లాలో తెల్లవారుజామున పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం తెనాలి పట్టణం సుల్తానాబాద్ లో వడ్డెర కాలనీ, సుగాలి కాలనీ తదితర ప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. అడిషనల్ ఎస్పీ రమణమూర్తి, తెనాలి డి.ఎస్.పి బి జనార్ధన రావు నేతృత్వంలో ఈ ప్రాంతంలోని దాదాపు 350 ఇళ్లలో సోదాలు నిర్వహించారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని నలుగురు సీఐలు, ఎస్ఐలతో సహా 160 మంది దాకా సిబ్బంది […]
ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నది. ఈ మీటింగ్ లో కొత్త ఆదాయ పన్ను బిల్లుపై చర్చించే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కాగా 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను సమర్పిస్తూ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని ప్రవేశపెడుతుందని వెల్లడించిన విషయం తెలిసిందే. వచ్చే వారం పార్లమెంటులో కొత్త ఆదాయపన్ను బిల్లును ప్రవేశపెట్టడానికి రెడీ అవుతున్న కేంద్రం. Also Read:Guntur: […]
ప్రేమ పేరుతో దారుణాలకు ఒడిగడుతున్నారు కొందరు వ్యక్తులు. ప్రేమ, పెళ్లి పేరుతో అమాయకపు యువతులను లోబర్చుకుని ప్రాణాలు తీస్తున్నారు. చంపడానికి కూడా వెనకాడడం లేదు. ఈ క్రమంలో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడు సచివాలయ ఉద్యోగి రాజారావు. అంతేకాదు. యువతిని వదిలించుకునేందుకు జనవరి 15న ఎలుకల మందు ఇచ్చి ఆత్మహత్యకు ప్రేరేపించి రాక్షసత్వం ప్రదర్శించాడు రాజారావు. తనను మోసం చేసిన సచివాలయ ఉద్యోగి రాజారావుపై భాదితురాలు […]
చట్టాలను అనుసరించాల్సిన అధికారులే అడ్డదార్లు తొక్కుతున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలని అవినీతికి పాల్పడుతున్నారు. పేదలను అందినకాడికి దోచుకుంటున్నారు. అలాంటి అధికారులపై చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఏమాత్రం మార్పు రావడం లేదు. తాజాగా ఓ డాక్టర్ పై వేటుపడింది. డెలివరీ కోసం వచ్చిన వారి నుంచి డబ్బులు గుంజుతున్న వైద్యురాలిని కలెక్టర్ సస్పెండ్ చేశారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్ అవినీతి, నిర్లక్ష్యం వహించే అధికారులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఉద్యోగులపై ఫిర్యాదులు చేస్తే కఠిన చర్యలు […]
Ram Gopal Varma: గత ఏడాది నవంబర్ 11వ తేదీన టీడీపీ లీడర్ రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాంగోపాల్ వర్మపై మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి నేడు పోలీసు విచారణకు హాజరుకానున్నారు రాంగోపాల్ వర్మ. ఇవాళ ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు. కాగా ఈ కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆర్జీవీ న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే […]
సోనూసూద్ నటుడిగా, మానవతావాదిగా దేశ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆపదలో ఉన్నారని తెలిస్తే అరక్షణం కూడా ఆలోచించకుండా సాయం అందించే గొప్ప వ్యక్తిత్వం ఆయన సొంతం. ఇప్పుడు సోనూసూద్ చిక్కుల్లో పడ్డారు. ఓ కేసులో ఆయనను అరెస్ట్ చేయాలంటూ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఇంతకీ సోనూసూద్ కు అరెస్ట్ వారెంట్ జారీ కావడానికి గల కారణం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. సోనూసూద్ కు మోసం కేసులో వాంగ్మూలం […]