హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అసభ్యకర మెసేజ్ లు బాలిక ప్రాణాలు తీశాయి. రంగనాయకుల గుట్టకు చెందిన బాలిక మీనాక్షి ఆత్మహత్యకు పాల్పడింది. ఇటీవల విద్యార్ది రోహిత్ తన తమ్ముడి సోషల్ మీడియా అకౌంట్ నుంచి బాలికకు అసభ్యకర మెసేజ్ లు పంపించాడు. బాలికను వేధించసాగాడు. పోకిరి చేష్టలకు భయపడిపోయిన బాలిక తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పింది. వెంటనే అప్రమత్తమైన వారు రెండు రోజుల క్రితం హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Also Read:Gold Rates: బంగారం ధరలకు రెక్కలు.. రూ. 2700 పెరిగిన తులం గోల్డ్ ధర
ఈ క్రమంలో ఓ రోజు రోహిత్ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో వచ్చి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో మానసికంగా కుంగిపోయిన బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతితో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఇలా జరిగిందని తల్లిదండ్రుల ఆరోపిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్ స్టేషన్ వద్దకు భారీగా చేరుకుంటున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.