జేఎస్ డబ్ల్యూ ఎంజీ మోటార్స్ మార్కెట్ లోకి కొత్త కారును విడుదల చేసింది. దుమ్మురేపే ఫీచర్లతో కొత్త కారు MG విండ్సర్ ఈవీ ప్రోను భారత్ మార్కెట్ లోకి రిలీజ్ చేసింది. ఈ కొత్త మోడల్ అధునాతన ఫీచర్లు, పెద్ద బ్యాటరీ ప్యాక్, మెరుగైన రేంజ్‌తో వినియోగదారులను ఆకర్షించేందుకు సిద్ధంగా ఉంది. జేఎస్ డబ్ల్యూ ఎంజీ విండ్సర్ ప్రో EV లో 52.9 KWh సామర్థ్యం గల బ్యాటరీ అమర్చారు. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 449 కి.మీ. వరకు ప్రయాణిస్తుందని కంపెనీ తెలిపింది. దీన్ని నిమిషాల్లో ఛార్జ్ చేయవచ్చు. దీనిలో అమర్చిన మోటారు నుంచి ఇది న్యూటన్ మీటర్ శక్తి, టార్క్‌ను పొందుతుంది.
Also Read:VarunTej : మెగా ఆనంద హేల.. తండ్రి కాబోతున్న వరుణ్ తేజ్
విండ్సర్ ప్రో EV లో డ్యూయల్ టోన్ ఇంటీరియర్స్, V2L, V2V లను కూడా పొందుతుంది. దీనితో పాటు, యాంబియంట్ లైట్, ఇన్ఫినిటీ గ్లాస్ రూఫ్, ఫ్రంట్ సీట్ వెంటిలేషన్, 15.6 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, నాలుగు స్పీకర్లు, నాలుగు ట్వీటర్లు, సబ్ వూఫర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్, ఫ్రంట్ వెంటిలేటెడ్ సీట్లు, చెక్క ఫినిషింగ్, 604 లీటర్ బూట్ స్పేస్, LED హెడ్‌లైట్లు, LED టెయిల్ లైట్లు, కనెక్ట్ చేయబడిన DRL, పవర్డ్ టెయిల్‌గేట్, 19 అంగుళాల అల్లాయ్ వీల్స్, గ్లాస్ యాంటెన్నా, ఫ్లష్ డోర్ హ్యాండిల్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
Also Read:Alert.. Alert: తెలంగాణ వాసులారా బహుపరాక్.. నేటి అర్థరాత్రి నుంచి బస్సులు బంద్..!
జేఎస్ డబ్ల్యూ ఎంజీ విండ్సర్ ప్రో EV లో భద్రతకు కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చారు. దీనికి లెవల్ 2 ADAS తో పాటు ABS, EBD, హిల్ హోల్డ్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ యాంకరేజ్ వంటి అనేక ఫీచర్లు అందించారు. జేఎస్ డబ్ల్యూ ఎంజీ విండ్సర్ ప్రో కూడా BaaS తో అందించబడుతోంది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 12.50 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. బ్యాటరీతో కూడిన దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 17.49 లక్షలు. బుకింగ్‌లను మే 8, 2025 నుంచి చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.