ఇన్ఫినిక్స్ స్మార్ట్ ఫోన్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. పవర్ ఫుల్ ఫీచర్లతో వస్తున్న ఈ మొబైల్స్ సేల్స్ లో దూసుకెళ్తున్నాయి. స్మార్ట్ ఫోన్ లవర్స్ కు ఇన్ఫినిక్స్ నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్స్ రాబోతున్నాయి. ఇన్ఫినిక్స్ నోట్ 50 సిరీస్ వచ్చే నెలలో లాంచ్ అవుతుంది. ఈ విషయాన్ని కంపెనీ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అయితే ఈ కొత్త సిరీస్ మొదట ఇండోనేషియాలో ప్రారంభించబడుతుంది. ఈ సిరీస్ మార్చి 3న ప్రారంభం కానుంది. […]
ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ(ఫిబ్రవరి 23) నిర్వహించిన గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఒక వైపు అభ్యర్థుల ఆందోళనలు మరో వైపు చివరి నిమిషం వరకు రాని స్పష్టత నడుమ గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా పూర్తయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 175 సెంటర్లలో పరీక్షలు జరిగాయి. గ్రూప్-2 మెయిన్స్ కు 92 శాతం మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. మొత్తం 92,250 మంది అభ్యర్థుల్లో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నవారు 86,459 […]
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించకపోతే ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. ఒక్కసారి అనారోగ్యానికి గురైతే ఆస్తులన్నీ అమ్ముకున్నా తిరిగి కోలుకుంటామన్న గ్యారంటీ లేదు. అందుకే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ఆరోగ్యానికి హాని చేసే ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కొన్ని కూరగాయలను మితంగా తీసుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే కొన్నింటిలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువ పరిమాణంలో తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. దీనివల్ల […]
రేపటి నుంచి(ఫిబ్రవరి 24) ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ప్రాంగణంలో రాకపోకలు, ప్రవేశాలపై ఉన్న నిబంధనల్ని కట్టుదిట్టంగా అమలు చేయలని నిర్ణయం తీసుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మీడియా, విజిటర్లు, పోలీసు సిబ్బందికి ప్రత్యేక పాస్ లు జారీ చేశారు. భద్రతా కారణాల రీత్యా పాస్ లు ఉన్నవారిని మాత్రమే అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించనున్నారు. అసెంబ్లీ, మండలిలో వేర్వేరు ప్రాంతాలకు వెళ్లేలా వివిధ కలర్ కోడ్ లతో పాస్ లను జారీ […]
సంచలనాలకు మారుపేరు జియో అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. జియో నెట్ వర్క్, జియో ఫోన్లతో మార్కెట్ లో అదరగొడుతోంది. తక్కువ ధరల్లోనే 4జీ ఫోన్లను తీసుకొచ్చి మొబైల్ ఇండస్ట్రీని సర్ ప్రైజ్ కు గురిచేసింది. ఇప్పుడు యూజర్లకు గుడ్ న్యూస్ అందించింది. కేవలం రూ. 699కే జియో 4G ఫోన్ ను అందిస్తోంది. జియోభారత్ కే1 కార్బన్ 4జీ కీప్యాడ్ ఫీచర్ ఫోన్ కేవలం రూ. 699 రూపాయలకు అందుబాటులో ఉంది. ఈ ధర […]
ఓటీటీ యాప్స్ అందుబాటులోకి వచ్చాక థియేటర్లకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోయింది. తమకు నచ్చిన సినిమాలను, సిరీస్ లను ఓటీటీల్లోనే చూస్తున్నారు. అయితే ఈ ఓటీటీ సబ్ స్క్రిప్షన్ తీసుకోవాలంటే కొంత ఎమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. కానీ, మీరు ఇప్పుడు ఉచితంగా నెట్ ఫ్లిక్స్ చూడొచ్చు. ఏకంగా 84 రోజుల పాటు ఫ్రీగా చూడొచ్చు. అదెలా సాధ్యం అనుకుంటున్నారా? జియో, ఎయిర్టెల్, విఐ అందించే రీఛార్జ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకున్నట్లైతే నెట్ఫ్లిక్స్ ఉచిత సభ్యత్వం పొందొచ్చు. […]
ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్ థామ్సన్ తన తాజా QLED టీవీని భారత మార్కెట్ లో విడుదల చేసింది. ఇది జియోటెలీ ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచే మొట్టమొదటి 43 అంగుళాల క్యూలెడ్ స్మార్ట్ టీవీ. JioTele OS తో వస్తున్న తొలి స్మార్ట్ టీవీ ఇదే. పవర్ పీచర్లతో వస్తున్న ఈ టీవీ ధర రూ.18,999గా కంపెనీ నిర్ణయించింది. ప్రముఖ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ నుంచి కొనుగోలు చేయొచ్చు. లాంచ్ ఆఫర్ కింద, కంపెనీ ఈ టీవీతో […]
టెన్త్ అర్హతతో జాబ్స్ కోసం చూస్తున్న వారికి గుడ్ న్యూస్. ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకునే అవకాశం వచ్చింది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ 1,161 కానిస్టేబుల్ ట్రేడ్స్మన్ పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా కానిస్టేబుల్ కుక్, టైలర్, బార్బర్, స్వీపర్, పెయింటర్, గార్డనర్ మొదలైన పోస్టులను భర్తీచేయనున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారు ఈ ఛాన్స్ ను మిస్ చేసుకోకండి. Also Read:Sandeep […]
ప్రభుత్వ ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్న వారికి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. GAIL ఇండియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 73 పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీకానున్న పోస్టుల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(కెమికల్) 21, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(ఇన్ స్ట్రెమెంటేషన్) 17, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 14, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(మెకానికల్) 8, ఎగ్జిక్యూటివ్ ట్రైనీ(బీఐఎస్) 13 […]
హైదరాబాద్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అపార్ట్ మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన బాలుడు మృతి చెందాడు. నీలోఫర్ ఆసపత్రిలో చికిత్స పొందుతూ ఆరేళ్ల ఆర్నవ్ తుది శ్వాస విడిచాడు. బాలుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. బాలుడు లిఫ్ట్ లో చిక్కుకున్న సమయంలో తీవ్రంగా గాయపడ్డాడని.. ఈ కారణంగానే బ్రెయిన్ డెడ్ అయి చనిపోయినట్లు వెల్లడించారు. బాలుడి మృతితో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి. అల్లారు ముద్దుగా పెంచుకున్న […]