బంగారం ధరలు ఊహించని రీతిలో పెరుగుతూ షాకిస్తున్నాయి. సామాన్యులకు పెరిగిన పసిడి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా నిన్న పెరిగిన పుత్తడి ధరలు నేడు తగ్గుముఖం పట్టాయి. నేడు గోల్డ్ ధరలు భారీగా తగ్గాయి. ఇవాళ తులం గోల్డ్ ధర రూ. 490 తగ్గింది. నేడు సిల్వర్ ధరలు పెరిగాయి. కిలో వెండి ధర రూ. 100 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9, 502, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,710 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Raj Bhavan : తెలంగాణ రాజ్‌భవన్‌లో హార్డ్‌డిస్క్‌ల చోరీ.. కీలక డేటా అపహరణపై కలకలం
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గింది. దీంతో రూ. 87,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గింది. దీంతో రూ. 95,020 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 87,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,170 వద్ద ట్రేడ్ అవుతోంది.
Also Read:Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక.. వెంటనే ఈ పని చేయండి!
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,09,100 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 98,100 వద్ద ట్రేడ్ అవుతోంది.