IPL 2025: తిక్కకుదిరింది.. గ్రౌండ్ లో గొడవ.. దిగ్వేష్ రాఠి-అభిషేక్ శర్మపై బీసీసీఐ చర్యలు
- దిగ్వేష్ రాఠి-అభిషేక్ శర్మపై బీసీసీఐ చర్యలు
- దిగ్వేష్ రాఠిపై ఒక మ్యాచ్ నిషేధం, 50% జరిమానా
- అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన IPL 2025 మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో దిగ్వేష్ సింగ్ రాఠి అభిషేక్ శర్మతో వాగ్వాదానికి దిగాడు. వీరిద్దరి వ్యవహారంపై బీసీసీఐ సీరియస్ అయ్యింది. BCCI (భారత క్రికెట్ నియంత్రణ మండలి) ఇద్దరు ఆటగాళ్లపై చర్యలు తీసుకుంది.ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు దిగ్వేష్ రాఠిపై ఒక మ్యాచ్ నిషేధం, 50% జరిమానా విధించింది. అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25% జరిమానా, ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.
Also Read:Zelenskyy: యుద్ధం ముగింపునకు రష్యా సిద్ధంగా లేదు.. ట్రంప్ ప్రకటన తర్వాత జెలెన్‌స్కీ వ్యాఖ్య
Also Read
- Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
- ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
- Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
ఐపీఎల్ అధికారిక మీడియా అడ్వైజరీ ప్రకారం.. ఎల్‌ఎస్‌జీ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రాటి ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు అతని మ్యాచ్ ఫీజులో 50 శాతం జరిమానా, ఒక మ్యాచ్ సస్పెన్షన్‌ను ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ సీజన్‌లో రాఠి చేసిన మూడవ లెవల్ 1 నేరం (ఆర్టికల్ 2.5 ప్రకారం). దీనికి ముందు రెండుసార్లు ఫైన్ విధించారు. మూడు మ్యాచ్‌ల్లో మొత్తం 5 డీమెరిట్ పాయింట్లు సాధించిన తర్వాత, రాఠి ఇప్పుడు మే 22న అహ్మదాబాద్‌లో గుజరాత్ టైటాన్స్‌తో జరిగే మ్యాచ్‌కు దూరంగా ఉండాల్సి ఉంటుంది.
Also Read:NTR Birthday : తారక్ బర్త్ డే సందర్భంగా.. మోత మోగిపోతున్న సోషల్ మీడియా
మరోవైపు, రాఠితో వాదించినందుకు అభిషేక్ శర్మపై కూడా బీసీసీఐ చర్య తీసుకుంది. ఎస్ఆర్ హెచ్ ఆల్ రౌండర్ అభిషేక్ శర్మకు మ్యాచ్ ఫీజులో 25 శాతం జరిమానా విధించారు. అతనిపై లెవల్ 1 నేరం (ఆర్టికల్ 2.6) కింద అభియోగం మోపబడింది. అయితే, ఇది అతని మొదటి ఉల్లంఘన కాబట్టి, అతనికి 1 డీమెరిట్ పాయింట్ మాత్రమే వచ్చింది. రెండు సందర్భాలలోనూ, లెవల్ 1 ఉల్లంఘనల విషయంలో మ్యాచ్ రిఫరీ నిర్ణయానికి కట్టుబడి ఉంటుందని ఐపీఎల్ స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Kajal Aggarwal: చందమామ సంసారంలో చిచ్చు?.. భర్తతో రిలేషన్‌పై స్టార్ హీరోయిన్ కాజల్ క్లారిటీ ఇదే!
-
Heavy Rain Alert: ఏపీ వైపు దూసుకొస్తున్న వాయుగుండం.. టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు.. అధికారులకు కీలక ఆదేశాలు..
-
Harish Shankar: అడగకుండానే చెప్పేస్తున్నా.. ఈ బ్యానర్లోనే నా నెక్స్ట్ మూవీ
-
ICC T20I Rankings: జపాన్‌పై విజయం.. మారిన ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియా..
-
Vallabhaneni Vamsi: స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి.. అసెంబ్లీలో జగన్‌ను సీఎం చేయాలి..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!