అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డీప్‌ఫేక్, రివెంజ్ పోర్న్‌లపై ఉక్కుపాదం మోపారు. వీటి కట్టడికి చట్టం చేశారు. ట్రంప్ బిల్లుపై సంతకం చేశారు. ఈ చట్టం పేరు టేక్ ఇట్ డౌన్ యాక్ట్. ఈ చట్టం అమల్లోకి వస్తే ఎవరైన వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి అనుమతి లేకుండా AI జనరేటెడ్ అశ్లీల చిత్రాన్ని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తే, అప్పుడు టెక్నాలజీ కంపెనీలు 48 గంటల్లోపు ఆ కంటెంట్‌ను తొలగించాల్సి ఉంటుంది. మన పిల్లలు, మన కుటుంబాలు, అమెరికా భవిష్యత్తు శ్రేయస్సు కోసం ‘టేక్ ఇట్ డౌన్’ చట్టం చాలా అవసరమని అమెరికా ప్రథమ మహిళ తెలిపారు.
Also Read:Ponnam Prabhakar : గుల్జార్ హౌజ్ అగ్ని ప్రమాదంపై కమిటీ ఏర్పాటు
వైట్ హౌస్‌లో జరిగిన రోజ్ గార్డెన్ వేడుకలో అమెరికా అధ్యక్షుడు ఈ బిల్లుపై సంతకం చేశారు. అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ కూడా ఆయనతో పాటు ఉన్నారు. ఈ బిల్లు ప్రకారం, రివెంజ్ పోర్న్ అని పిలవబడే, చట్టవిరుద్ధమైన డీప్‌ఫేక్ కంటెంట్‌ను పోస్ట్ చేయడం చట్టవిరుద్ధమైన చర్య అవుతుంది. ఈ చట్టాన్ని ఉల్లంఘించిన ఎవరైనా జైలు శిక్ష, జరిమానా లేదా రెండింటికి గురవుతారు. కాంగ్రెస్‌లో ద్వైపాక్షిక మద్దతు ఉన్న ఈ బిల్లును ఏప్రిల్‌లో ప్రతినిధుల సభ ఆమోదించింది. ఈ బిల్లును సెనేట్ కామర్స్ కమిటీ చైర్మన్ టెడ్ క్రూజ్ రాశారు. ఆయనతో డెమోక్రటిక్ సెనేటర్ అమీ క్లోబుచార్ కూడా చేరారు.
Also Read:OTT ట్రెండింగ్‌లో అనగనగా.. కంటెంట్‌తో మెప్పించిన సుమంత్..!
డీప్‌ఫేక్ అంటే ఏమిటి?
డీప్‌ఫేక్ అంటే AI సహాయంతో రూపొందించబడిన వీడియోలు లేదా ఫోటోలు. దీని సాయంతో సెలబ్రిటీలు ఇతర వ్యక్తుల ఫోటోల మార్పింగ్ కు పాల్పడుతుంటారు. చాలా సందర్భాలలో, డీప్‌ఫేక్ ఉపయోగించి, అశ్లీల చిత్రాలు, వీడియోలపై మరొక వ్యక్తి ఫోటోలను చేరుస్తారు.