Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక.. వెంటనే ఈ పని చేయండి!
- కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక
- టెక్ దిగ్గజం వెబ్ బ్రౌజర్‌లో ఉన్న కొన్ని లోపాల గురించి తెలియజేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏదైనా తెలియని సమాచారం తెలుసుకోవాలనుకుంటే టక్కున గుర్తొచ్చేది గూగుల్ క్రోమ్. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ చేస్తుంటారు. సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ క్రోమ్ వాడే వారికి కేంద్ర ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్‌లో గూగుల్ క్రోమ్ ఉపయోగిస్తుంటే వెంటనే ఈ పని చేయాలని అలర్ట్ చేసింది. ప్రభుత్వ సంస్థ CERT-In (ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం) గూగుల్ క్రోమ్ వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. టెక్ దిగ్గజం వెబ్ బ్రౌజర్‌లో ఉన్న కొన్ని లోపాల గురించి తెలియజేసింది. ఈ లోపాలను ఆసరాగా చేసుకుని హ్యాకర్లు మీ ల్యాప్‌టాప్ నుంచి ముఖ్యమైన డేటాను చోరీ చేసే అవకాశం ఉందని తెలిపింది.
Also Read:Illicit relations: మామతో పరారైన భార్య.. రూ. 20 వేల రివార్డు ప్రకటించిన భర్త
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
గూగుల్ బ్రౌజర్ క్రోమ్ పాత వెర్షన్లలో కొన్ని లోపాలు గుర్తించామని, దీని కారణంగా హ్యాకర్లు వినియోగదారుల కంప్యూటర్లను సులభంగా యాక్సెస్ చేయవచ్చని CERT-In తెలిపింది. మీరు Windowsలో Chrome ఉపయోగిస్తుంటే, ఈ బగ్‌లు 136.0.7103.114 కి ముందు వెర్షన్‌లలో ఉన్నాయి. మీరు Mac లేదా Linux వినియోగదారు అయితే, ఈ బగ్ 136.0.7103.113 కి ముందు వెర్షన్లలో ఉంది. గూగుల్ క్రోమ్ పాత వెర్షన్లలో రెండు బగ్‌లు ఉన్నాయని CERT-In నివేదించింది.
Also Read:Illicit relations: మామతో పరారైన భార్య.. రూ. 20 వేల రివార్డు ప్రకటించిన భర్త
CVE-2025-4664: Chrome లోని ఈ బగ్ బ్రౌజర్ లోడర్ విధానాన్ని సరిగ్గా వర్తింపజేయదు. దీనితో హ్యాకర్ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్‌సైట్ ద్వారా మీ కంప్యూటర్ నుంచి డేటాను దొంగిలించవచ్చు.
CVE-2025-4609: ఈ బగ్ క్రోమ్ మోజో కాంపోనెంట్‌లో ఉంది. ఇది హ్యాండ్లింగ్ సమస్యను సృష్టిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని, హ్యాకర్లు మీ సిస్టమ్‌లోకి చొరబడవచ్చు.
Also Read:Balochistan: బలూచిస్తాన్‌లో బలవంతంగా అదృశ్యం అవుతున్న బలూచ్‌లు.. పాకిస్తాన్ సైన్యంపై తీవ్ర ఆరోపణలు
రక్షణ కోసం ఏమి చేయాలి?
ఈ బగ్‌లను నివారించడానికి, వినియోగదారులు తమ సిస్టమ్‌లో తాజా Chrome బ్రౌజర్‌ను ఉపయోగించాల్సి ఉంటుందని CERT-In Chrome వినియోగదారులకు స్పష్టంగా తెలిపింది. దీని కోసం వారు Chrome ని అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది. అప్ డేట్ చేసేందుకు కంప్యూటర్‌లో Chrome బ్రౌజర్‌ను ఓపెన్ చేయాలి. తర్వాత కుడి వైపున ఉన్న మూడు చుక్కలు (మెనూ) పై క్లిక్ చేయండి. ఇప్పుడు హెల్ప్ లో About Google Chrome పై క్లిక్ చేయాలి. క్రోమ్ బ్రౌజర్ ఆటోమేటిక్ గా అప్డేట్ అవుతుంది.
తాజావార్తలు
-
Tirumala Leopard : తిరుమల నడకమార్గంలో చిరుత.. భక్తులకు టీటీడీ అలర్ట్.!
-
Imran Khan Release Protest: ఇమ్రాన్ ఖాన్ విడుదల కోసం భారీ ఉద్యమం.. ఇస్లామాబాద్‌లో 144 సెక్షన్, 2 వేల మంది అరెస్ట్
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!