బ్యాంకింగ్ సెక్టార్ లో స్థిరపడాలనుకుంటున్నారా? బ్యాంక్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సౌత్ ఇండియన్ బ్యాంక్ జూనియర్ ఆఫీసర్ / బిజినెస్ ప్రమోషన్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. భారీ వేతనంతో కూడిన ఈ జాబ్స్ కొడితే లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకునేందుకు అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుంచి ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. దీనితో పాటు, ఏప్రిల్ 30, 2025 ను దృష్టిలో ఉంచుకుని, అభ్యర్థి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలకు మించకూడదు. SC/ST కేటగిరీ వారికి గరిష్ట వయస్సులో 5 సంవత్సరాలు సడలింపు ఇవ్వబడుతుంది.
Also Read:Gold Rates: ఇది కదా కావాల్సింది.. భారీగా తగ్గిన బంగారం ధరలు
ఆన్‌లైన్ పరీక్ష, వ్యక్తిగత ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 3 సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకం ఇస్తారని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. పనితీరు ఆధారంగా కాల వ్యవధిని పొడిగించవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు వార్షిక జీతం రూ.7.44 లక్షలు. జనరల్ కేటగిరీ అభ్యర్థులు రూ.500, ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ప్రక్రియ నిన్నటి అంటే మే 19, 2025 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు మే 26 వరకు ఆన్ లైన్ విధానంలో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.