అగ్రరాజ్యం అమెరికాలో తీవ్ర తుఫాను విధ్వంసం సృష్టించింది. భీకరమైన గాలులతో విరుచుకుపడి అనేక ఇళ్లను నేలమట్టం చేసింది. తుఫాను ధాటికి 34 మంది మరణించినట్లుగా సమాచారం. టోర్నడోలు అమెరికాలోని కొన్ని ప్రాంతాలను అతలాకుతలం చేశాయి. షెర్మాన్ కౌంటీలో దుమ్ము తుఫాను కారణంగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది మరణించారు. మూడు కౌంటీలలో ఆరుగురు మరణించారని, ముగ్గురు తప్పిపోయారని మిస్సిస్సిప్పి గవర్నర్ టేట్ రీవ్స్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 29 మంది గాయపడ్డారని వెల్లడించారు. పదుల సంఖ్యలో వాహనాలు […]
ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది అబూ ఖతల్ సింఘి పాకిస్తాన్లో హతమయ్యాడు. శనివారం రాత్రి 8 గంటలకు అబూ ఖతల్‌ను ఉరితీశారు. అతను భారత్ లో దాడులకు పాల్పడ్డాడు. NIA అతన్ని వాంటెడ్‌గా ప్రకటించింది. అబూ ఖతల్.. హఫీజ్ సయీద్ కు సన్నిహితుడిగా గుర్తించబడ్డాడు. జమ్మూ కాశ్మీర్‌లోని రియాసిలోని శివ-ఖోడి ఆలయం నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. Also Read: Chandrababu Naidu: మనం నిత్యం […]
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇప్పుడు రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికింది. ఏకంగా డ్రైవర్ రహిత బస్సులు వచ్చేశాయి. డ్రైవర్ లేకుండానే రోడ్లపై రయ్ రయ్ మంటూ దూసుకెళ్తున్నాయి. అయితే ఇది మనదేశంలో కాదండోయ్.. స్పెయిన్ లో అందుబాటులోకి వచ్చాయి. స్పెయిన్‌లోని బార్సిలోనా డౌన్టౌన్లో డ్రైవర్‌లేని మినీబస్సులను విజయవంతంగా పరీక్షించారు. ఈ సందర్భంగా ప్రయాణికులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. Also Read:Tirumala: ఆటోవాలలతో శ్రీవారి భక్తులకు తప్పని తిప్పలు! బస్సు ప్రయాణికులతో […]
కెనడా 24వ ప్రధానిగా మార్క్ కార్నీ ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. తాజాగా కెనడా కేబినెట్ కొలువుదీరింది. కెనడా ప్రభుత్వంలో భారత సంతతికి చెందిన ఇద్దరు మహిళలకు చోటుదక్కింది. కెనడియన్ పౌరురాలు అనితా ఆనంద్, ఢిల్లీలో జన్మించిన కమల్ ఖేడా కెనడియన్ పార్లమెంటుకు ఎన్నికైన అతి పిన్న వయస్కులైన మహిళలు వీరే. అనిత (58) ఇన్నోవేషన్, సైన్స్, పరిశ్రమల శాఖ మంత్రిగా, కమల్ (36) ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. మాజీ ప్రధాన మంత్రి జస్టిన్ […]
యెమెన్‌లో ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులపై అమెరికా వరుస దాడులకు పాల్పడింది. హౌతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం కొనసాగిస్తున్న దృష్ట్యా అమెరికా ఈ చర్య తీసుకుంది. యెమెన్ రాజధాని సనాపై అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో 19 మంది మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారని హౌతీల ఆధీనంలో ఉన్న ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. Also Read:Uttam Kumar Reddy : కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సాధించిన విజయం ఇది హౌతీ […]
ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరిగింది. ఎలక్ట్రిక్ స్కూటర్లు, బైకులు, కార్లు కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఆటోమొబైల్ కంపెనీలు సైతం లేటెస్ట్ ఫీచర్లతో ఎలక్ట్రిక్ వెహికల్స్ ను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. ఇటీవల హర్యానాకు చెందిన ఎలక్ట్రిక్ టూవీలర్ తయారీ కంపెనీ జెలియో ఎలక్ట్రిక్ మొబిలిటీ దేశీయ మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ స్కూటర్ లిటిల్ గ్రేసీని అధికారికంగా విడుదల చేసింది. స్పెషల్ లుక్, డిజైన్‌తో అట్రాక్ట్ చేస్తోంది. ఈ స్కూటర్ ప్రారంభ ధర కేవలం రూ. 49,500 (ఎక్స్-షోరూమ్) […]
తమిళనాడులో త్రిభాషా వివాదం రగులుకుంటోంది. రాష్ట్ర బడ్జెట్ లోగో నుంచి రూపాయి చిహ్నాన్ని స్టాలిన్ ప్రభుత్వం తొలగించింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్రిభాషా పాలసీ కొత్తది కాదని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటీ నుంచి ఈ విధానం కొనసాగుతుందని అన్నారు. నచ్చిన భాషలో చదువుకోవచ్చు. దేశంలో ఎక్కడా హిందీ భాషను రుద్దడం లేదని చెప్పారు. Also Read:Tirupati Stampede: […]
ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీగా జాబ్ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ అవుతున్నాయి. నిరుద్యోగులకు ఇదే మంచి సమయం. కొన్ని రకాల ఉద్యోగాలను ఎలాంటి రాత పరీక్ష రాయకుండానే సొంతం చేసుకోవచ్చు. జాబ్ కోసం సెర్చ్ చేస్తున్న వారికి ఇలాంటి అవకాశమే వచ్చింది. నార్తర్న్ కోల్డ్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 1765 పోస్టులను భర్తీ చేయనున్నారు. […]
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ చేసిన విమర్శలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ మేనిఫెస్టో అని.. గాంధీ భవన్ లో మాట్లాడినట్టు ఉంది అని బీఆర్ఎస్ వాళ్ళు గవర్నర్ ప్రసంగంపై విమర్శలు గుప్పించారు. ఈ వ్యవహారంపై రేవంత్ మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో అన్న వాళ్ళు ఇలా మాట్లాడుతారా.. అజ్ఞానమే.. తన విజ్ఞానం అనుకుంటున్నారు అని […]
మాంసాహారాల్లో శరీరానికి కావాల్సిన ప్రోటీన్ లభిస్తుండడంతో చాలా మంది చికెన్, మటన్ లను లాగించేస్తుంటారు. కొంతమందికి ముక్కనేనిదే ముద్ద దిగదు. అయితే నాన్ వెజ్ తినడం వల్ల కొందరికి ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే చాలా మంది నాన్-వెజ్ జీర్ణించుకోలేరు. దీంతో అలర్జీకి గురవుతుంటారు. వైద్యులు కూడా అలాంటి వారికి నాన్-వెజ్ తినకూడదని సూచిస్తుంటారు. ముఖ్యంగా ఆ వ్యాధులతో బాధపడుతున్నవారు నాన్ వెజ్ కు దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. Also Read:YS Sunitha Reddy: వివేకా […]