బంగారం ధరలు కొనుగోలుదారులకు షాకిస్తున్నాయి. రోజు రోజుకు ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. నేడు తులంపై రూ. 430 పెరిగింది. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,960, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,130 వద్ద ట్రేడ్ అవుతోంది. గోల్డ్ ధరలతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 400 పెరిగింది. దీంతో రూ. 91,300 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 430 పెరిగింది. దీంతో రూ. 99,600 వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
Also Read:Yuzvendra Chahal: చహల్ ఖాతాలో చెత్త రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో తొలి ఆటగాడు!
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,450 వద్దకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 99,750 వద్ద ట్రేడ్ అవుతోంది. బంగారం బాటలోనే వెండి ధరలు పయనిస్తున్నాయి. నేడు కిలో వెండిపై రూ. 1000 పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,14,000 వద్ద అమ్ముడవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 2000 పెరిగింది. దీంతో రూ. 1,04,000 వద్ద ట్రేడ్ అవుతోంది.