హైదరాబాద్ లో భారీగా పట్టుబడ్డ అల్ప్రాజోలం ట్యాబ్లెట్స్ పట్టుబడ్డాయి.1లక్ష 80 వేల ట్యాబ్లెట్స్ ని ఎక్సైజ్ శాఖ సీజ్ చేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితులు అరెస్ట్ కాగా, పరారీలో మరొకరు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అల్ప్రాజోలం కేసులో ముగ్గురిపై ఎక్సైజ్ పోలీసులు కేసునమోదు చేశారు. ఎక్సైజ్ జాయింట్ కమిషనర్ ఖురేషి మాట్లాడుతూ.. ‘నిబంధనలకు విరుద్ధంగా మెడిసిన్ సప్లై చేస్తున్న ముఠా ను అరెస్ట్ చేశాము..1.8 లక్షల ఆల్ఫా జోలం ట్యాబ్లెట్స్ స్వాధీనం చేసుకున్నాం.. స్వాధీనం చేసుకున్న ట్యాబ్లెట్స్ విలువ 9 లక్షలు ఉంటుందని తెలిపారు.
Also Read:Ayodhya: అయోధ్యలో మరో అద్భుతం.. రామ దర్బార్ప్రాణ ప్రతిష్ట
ఇద్దరు ముఠా సభ్యులను అరెస్ట్ చేసాం.. మరొకరు పరారీలో ఉన్నారు.. హైదరాబాద్ ఆటోనగర్ లో ఓ కొరియర్ ఆఫీస్ నుంచి తీసుకెళ్తుండగా అరెస్ట్ చేశాం.. ఈ మందులు గుజరాత్ లో మ్యానుఫ్యాక్చరింగ్ అయినట్టు గుర్తించాం.. ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుంది.. డాక్టర్ల సూచనల మేరకే ఈ ట్యాబ్లెట్స్ వాడాలి.. ఇల్లీగల్ గా ఈ ముఠా సభ్యులు ఎలాంటి అనుమతి లేకుండా మెడికల్ షాపులకి పబ్లిక్ గా అమ్ముతున్నట్టు గుర్తించాము.. మానసిక రుగ్మతలకు ట్యాబ్లెట్స్ లని వాడుతారు.. లక్ష్మణ్, మునిశేఖర్ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు.. ఉత్తరప్రదేశ్ చెందిన అజయ్ త్రిపాఠి పరారీలో ఉన్నాడు’ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారని తెలిపారు.