వరంగల్ లోని ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో ఘరానా మోసం వెలుగుచూసింది. మోసం చేసింది బయటి వ్యక్తులనుకుంటే పొరపాటే. బ్యాంకు మేనేజర్ తో పాటు, బ్యాంకు సిబ్బంది మోసానికి తెరలేపారు. ఏకంగా రూ. 43 లక్షలు కొల్లగొట్టారు. బ్యాంకు మేనేజర్ కొప్పుల శివకృష్ణ, జాయింట్ కస్టోడియన్స్ రాము శర్మ, జీవిత కుమార్, గోల్డ్ అప్రైజర్స్ బ్రహ్మచారి, రాజమౌళి, కరుణాకర్ కస్టమర్ల పేర్లపై అక్రమంగా ఖాతాలు తెరిచినట్లు డిప్యూటీ జనరల్ మేనేజర్ కు ఫిర్యాదు చేశారు.
Also Read:Trump: ట్రంప్ మరో షాక్.. కొలంబియా యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేస్తామని వార్నింగ్
ఫిర్యాదు పై స్పందించిన ఉన్నతాధికారులు బ్యాంకులో తనిఖీలు నిర్వహించగా తప్పుడు ఖాతాల ఆధారంగా నకిలీ బంగారు ఆభరణాలను కుదవ పెట్టి రూ. 43 లక్షల రూపాయల రుణాన్ని పొందినట్లు గ్రహించారు బ్యాంకు ఉన్నతాధికారులు. డిప్యూటీ జనరల్ మేనేజర్ చంద్ర ప్రకాష్ ఫిర్యాదు మేరకు శివకృష్ణ, కస్టోడియన్స్, అప్రైజర్ స్ పై సెక్షన్ 221 క్రింద కేసు నమోదు చేశారు వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీసులు.