Krishna: స్వామీజీల వేషంతో ఎంట్రీ.. సీన్ కట్ చేస్తే..!
- పారిశ్రామికవేత్త ఇంట్లో దొంగబాబాల హల్‌చల్
- ఇంట్లో ఉన్న వృద్దులను అదరగొట్టారు
- తమిళనాడు ప్రాంతానికి చెందిన వాహనంలో వచ్చినట్లు గుర్తింపు
- తమిళనాడు ఆలిండియా హిందూ ఫెడరేషన్ అన్ని స్టిక్కరింగ్
- నెంబర్ ప్లేట్ అసలైనదా లేక నకిలీదా అనే దానిపై దృష్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణా జిల్లా ఉయ్యూరులో స్వామీజీల పేరుతో బెదిరింపులకు దిగిన ఘటన కలకలం రేపింది. ఆకునూరు గ్రామంలో పారిశ్రామిక వేత్త ఇంటికి తమిళనాడు నుంచి వచ్చిన స్వామీజీలమని చెప్పి బెదిరింపులకు దిగటంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. తాము అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే శపిస్తామని వృద్ధ మహిళను బెదిరించినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ కంత్రీ బాబాలు ఎవరు? వారి మోటో ఏంటి?
కృష్ణాజిల్లా ఉయ్యూరు మండలంలో ఉన్న ఆకునూరు గ్రామంలో ఓ పారిశ్రామికవేత్త ఇంట్లో దొంగబాబాలు హల్‌చల్ చేశారు. ఏకంగా లక్ష రూపాయలు కావాలని ఇంట్లో ఉన్న వృద్దులను అదరగొట్టారు. లేదంటే శపిస్తామని చెప్పి బెదిరించారు. ఇంట్లో వృద్దులు మాత్రమే ఉండడంతో ఈ దురాగతానికి తెగబడ్డట్లు తెలుస్తోంది
Also Read
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
- Bihar Girl Harassment: బీహార్‌లో వరుస ఘటనలు.. తాజాగా టూరిస్ట్ స్పాట్లో బాలికకు వేధింపులు.. వీడియో వైరల్
పారిశ్రామికవేత్త ఫిర్యాదుతో కేసు నమోదు
ఈ ఘటనపై పారిశ్రామికవేత్త ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు షురూ చేశారు. ఈ క్రమంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఉయ్యూరు రూరల్ ఎస్సై సుభాషిని బాధిత వృద్ధ మహిళతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
స్వామీజీల మాదిరిగా వచ్చిన వ్యక్తులు తమిళనాడు ప్రాంతానికి చెందిన వాహనంలో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. వారు వినియోగించిన వాహనానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ని టోల్ ప్లాజాతోపాటు స్థానికంగా ఉన్నటువంటి ప్రధాన రోడ్లలో ఉన్న సిసిటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా సేకరించారు. వారు వినియోగించిన వాహనంపై తమిళనాడు ఆలిండియా హిందూ ఫెడరేషన్ అన్ని స్టిక్కరింగ్ కూడా ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అసలు ఈ వ్యక్తులు వినియోగించిన వాహనానికి ఉన్న నెంబర్ ప్లేట్ అసలైనదా లేక నకిలీదా అనేది కూడా గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. దీంతోపాటు ఇక్కడికి రావటానికి ముందు స్థానికంగా ఉన్నటువంటి విజయవాడ గాని ఇతర ప్రాంతాల్లో ఈ వాహనం రాకపోకలు ఏమైనా జరిగాయా? అనేది పరిశీలిస్తున్నారు.
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అయి ఉంటుందని అనుమానం
ప్రస్తుతం లభించిన సీసీ ఫుటేజీ క్లూ ఆధారంగా అసలు నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. వచ్చిన వారు అంతర్రాష్ట్ర దొంగల ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?