Iran-Israel: యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ ప్రకటన.. ఇంకోవైపు ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
- యుద్ధానికి బ్రేక్ ఇస్తున్నట్లు ఓ వైపు ట్రంప్ ప్రకటన
- ఇంకోవైపు ట్రెహాన్‌పై ఇజ్రాయెల్ దాడులు
- పశ్చిమాసియాలో కొనసాగుతోన్న ఉద్రిక్తతలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇరాన్‌తో యుద్ధానికి 5 రోజులు బ్రేక్ ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. ఇరాన్‌తో సానుకూల చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బ్రేక్ ఇస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. ట్రంప్ అలా ప్రకటించారో.. లేదో టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ దాడులు చేస్తోంది. తాము టెహ్రాన్‌లో మరో విడత దాడులు ప్రారంభించినట్లు ఐడీఎఫ్ ఎక్స్‌లో పోస్ట్ చేసింది. ‘‘టెహ్రాన్ వ్యాప్తంగా ఇరాన్ ఉగ్రవాద పాలన, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ఐడీఎఫ్ ఇప్పుడే మరో విడత దాడులను ప్రారంభించింది..’’ అని పేర్కొంది.
మరోవైపు ఇరాన్.. ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, యూఏఈతో సహా గల్ఫ్ అంతటా ఉన్న చమురు, గ్యాస్ సౌకర్యాలపై క్షిపణి, డ్రోన్ దాడులతో ప్రతీకారం తీర్చుకుంటుంది. శనివారం అమెరికా ఇరాన్‌లోని నతాంజ్ అణు కేంద్రంపై దాడి చేయగా.. టెహ్రాన్ హిందూ మహాసముద్రంలోని అమెరికా-యూకే స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అయితే వాటిలో ఏదీ లక్ష్యాన్ని చేరలేదు. ట్రంప్‌కు ఆశ్చర్యకరమైన పరిణామాలు ఎదురవుతాయని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది.
Also Read
- Tarique Rahman: నవంబర్‌లో భారత్‌కు బంగ్లాదేశ్ ప్రధాని రెహమాన్? ఢిల్లీతో చర్చలు షురూ!
- Pakistan: పాకిస్తాన్లో ఘోర పేలుడు.. 15 మంది మృతి..
- KFC పార్కింగ్‌లో అద్భుతం.. ఆర్డర్ ఇవ్వకముందే డెలివరీ! ‘కల్నల్ కోడీ’ థ్రిల్లింగ్ స్టోరీ..
- Tiffany Trump in Desi Look: అంబానీ గణేష్ వేడుకల్లో ట్రంప్ కుమార్తె టిఫనీ ట్రంప్.. లెహంగాలో ‘దేశీ’ లుక్ అదుర్స్
ఆదివారం ఇరాన్‌తో సంభాషణలు జరిగాయని.. అతి త్వరలోనే ఒక ఒప్పందం కుదురుతుందని తాను ఆశిస్తున్నానని ట్రంప్ అన్నారు. ఈ చర్చల్లో మధ్యప్రాచ్య రాయబారి స్టీవ్ విట్కాఫ్, అల్లుడు జారెడ్ కుష్నర్ పాల్గొన్నారని తెలిపారు. యుద్ధాన్ని ముగించడంపై అమెరికా, ఇరాన్‌లు చర్చలు జరుపుతున్నాయని… ఇరు దేశాల మధ్య ‘‘ప్రధానమైన అంగీకార అంశాలు’’ ఉన్నాయని ట్రంప్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Warren Buffett: తండ్రి స్థానంలో కొడుకు.. వారెన్ బఫెట్ సామ్రాజ్యానికి కొత్త రారాజు ఇతడే!
-
Danam Nagender : దానం నాగేందర్ ఉదంతంపై హరీష్ రావు కీలక వ్యాఖ్యలు..
-
NSE IPO: రెండో రోజే NSE ఐపీఓ 100 శాతం సబ్‌స్క్రైబ్.. ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..
-
Mamata Banerjee: అభ్యర్థి ఔట్.. కాంగ్రెస్‌కు మమత మద్దతు: బెంగాల్ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్..
-
PM Modi: నిరుద్యోగులకు శుభవార్త.. రేపు 51 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించనున్న మోడీ
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..