Rajahmundry: మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్.. ఒకరి బలి
- మద్యం మత్తులో పోకిరీల హల్‌చల్
- కారుతో బీభత్సం సృష్టించిన కంత్రీగాళ్లు
- రోడ్డుపై ఆగమాగం చేసిన యువకులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మద్యం మత్తులో స్టీరింగ్ పట్టిన నలుగురు యువకులు ఒక కుటుంబాన్ని చీకట్లోకి నెట్టారు. రాజమండ్రిలో అర్ధరాత్రి రోడ్లపై రేసింగ్ చేస్తూ పలుచోట్ల ప్రమాదాలు చేశారు పోకిరీ యువకులు. చివరికి వారి నిర్లక్ష్యం కారణంగా ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో షికారు చేస్తూ మద్యం మత్తులో ర్యాష్ డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
కారులో నలుగురు యువకులు.. పీకలదాకా మద్యం తాగారు.. అర్ధరాత్రి షికారుకు బయల్దేరారు. అసలే మద్యం మత్తు..పైగా హైస్పీడ్‌తో రోడ్డుపై బీభత్సం సృష్టించారు. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పలు ప్రమాదాలు చేశారు కారులోని యువకులు.
Also Read
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
- Uttar Pradesh: ‘‘మహిళ’’గా మారేందుకు అడ్డు చెప్పిందని తల్లి దారుణహత్య..
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులతో పాటు ఒక ద్విచక్రవాహనాన్ని.. కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో… ధవళేశ్వరానికి చెందిన వాసు అనే 45 సంవత్సరాల వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.
కేసులో నిందితులైన నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు రాజమండ్రి ప్రకాష్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు అంటున్నారు. అంతకు ముందే ఓ తోపుడు బండిని కూడా ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు.
రోడ్డుపై పోకిరీలు చేసిన నిర్లక్ష్యపు డ్రైవింగ్ కారణంగా ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!