Delhi: ఆ వార్తలన్నీ అబద్ధం.. హార్ముజ్ దగ్గర వసూళ్లపై ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన
- హార్ముజ్ దగ్గర వసూళ్లపై ఇరాన్ ఎంబసీ కీలక ప్రకటన
- వ్యక్తుల ప్రకటన అధికారికం కాదు
- ఆ వార్తలన్నీ అబద్ధం అంటూ ఎక్స్‌లో వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమాసియాలో తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేయగా.. ఇరాన్ ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో అన్ని దేశాలకు చెందిన నౌకలు నిలిచిపోయాయి. అయితే నౌకలు విడిచిపెట్టేందుకు.. హార్ముజ్ గుండా వెళ్లేందుకు 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇరాన్ పార్లమెంట్ నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యుడు అలాయుద్దీన్ బరూజెర్ది చెప్పినట్లుగా ప్రభుత్వ రంగ మీడియా ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ బ్రాడ్‌కాస్టింగ్ వెల్లడించింది.
ఇది కూడా చదవండి: UP: ఇద్దరు భార్యలతో 18 మంది సంతానం.. చివరికి ప్రియురాలి చేతిలో..!
Also Read
- Turkey-UN: టర్కీ బుద్ధి మారలేదు.. యూఎన్‌లో పాక్‌కు మద్దతుగా కాశ్మీర్ ప్రస్తావన
- Pezeshkian: ‘మేము ఉగ్రవాదులం కాదు.. బాధితులం’.. యూఎన్‌లో ఫొటోలు చూపించి ఇరాన్ అధ్యక్షుడు ప్రసంగం
- Jaishankar-Rubio: రూబియోతో జైశంకర్ భేటీ.. రష్యా ఆంక్షల బిల్లుపై అభ్యంతరం
- Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
అయితే ఈ వార్తలు ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున భయాందోళనలు కలిగించాయి. ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేయడంపై ఆందోళనలు రేకెత్తాయి. తాజాగా ఈ అంశంపై ఢిల్లీలోని ఇరాన్ రాయబార కార్యాలయం స్పందించింది. హార్ముజ్ గుండా వెళ్లడానికి 2 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు నిరాధారమైనవని ఇరాన్ రాయబార కార్యాలయం కొట్టిపారేసింది. హార్ముజ్ వసూలుపై ప్రకటనలు కేవలం అది వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొంది. ఆ ప్రకటన ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ అధికారిక ప్రకటన కాదని.. ఆ ప్రకటనలు పరిగణనలోకి తీసుకోవద్దని సూచించింది.
ఇది కూడా చదవండి: PM Modi: కరోనాను ఎదుర్కొన్నట్లే.. ఈ సంక్షోభాన్ని జయిస్తాం.. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై మోడీ వ్యాఖ్య
గత నెల 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ సహా అత్యున్నత నాయకులు చనిపోయారు. దీంతో ప్రతీకారంగా గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది. దీంతో పెద్ద ఎత్తున చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. అన్ని దేశాల్లో గ్యాస్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
In response to certain claims regarding the alleged receipt of a sum of 2 million dollars by the Islamic Republic of Iran from vessels transiting the Strait of Hormuz, it is emphasized that such claims are unfounded. The statements made in this regard merely reflect the personal…
— Iran in India (@Iran_in_India) March 23, 2026
తాజావార్తలు
-
AP Severe Depression Landfall: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం.. 70 కి.మీ వేగంతో గాలులు
-
Coal Supply : యాదాద్రి ప్లాంట్‌పై సీఎం ఫోకస్.. దసరాకల్లా ఫుల్ పవర్
-
Japan Captain: వైభవ్ సూర్యవంశీ ఆడతాడని అనుకున్నా.. జపాన్ కెప్టెన్ అసంతృప్తి..
-
AP Liquor Shops: లిక్కర్ షాపులపై కీలక నిర్ణయం.. ఇక రెన్యువల్ గడువు పొడిగింపు లేదు..!
-
OTR: దేవుడి సాక్షిగా రాజకీయ పోరు.. కాణిపాకం చుట్టూ చిత్తూరు పాలిటిక్స్
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!