గాజాలో ఇంకా యుద్ధం ముగియలేదని.. బందీలను బయటకు తీసుకురావడమే తన తొలి ప్రాధాన్యత అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. ట్రంప్ ప్రణాళికకు, బందీలను విడుదల చేయడానికి హమాస్ ప్రాథమికంగా అంగీకరించిందని.
గాజాలో అధికారాన్ని విడిచిపెట్టకపోతే పూర్తిగా నిర్మూలం అవుతారని హమాస్‌ను మరోసారి ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. దీంతో శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలకు అంగీకారం తెల్పుతున్నట్లు హమాస్ ప్రకటించింది.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ లక్ష్యంగా ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ విమర్శలు గుప్పించారు.
చాలా మంది సింధీలు పాకిస్థాన్‌కు వెళ్లలేదని.. మనమంతా అవిభక్త భారతదేశం అని గుర్తించుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. సత్నాలో సింధీ క్యాంప్ గురుద్వారా ప్రారంభోత్సవానికి హాజరైన ఆయన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించారు.
దేశంలో ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మహిళలపై మాత్రం అఘాయిత్యాలు మాత్రం అగడం లేదు. ఎక్కడొక చోట అబలలపై దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ముంబైలో ఒక డెలివరీ బాయ్.. మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఘటనను మరువక ముందే గురుగ్రామ్‌లో మరో ఘోరం వెలుగు చూసింది.
పశ్చిమబెంగాల్‌ను భారీ వర్షాలు ముంచెత్తాయి. డార్జిలింగ్‌లో కొండచరియలు విరిగిపడి దాదాపు 17 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు.
బీహార్‌లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఈసీ బృందం పాట్నా వచ్చింది. వివిధ పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. నేతల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.
స్త్రీలను గౌరవించడం ప్రతి పౌరుడి యొక్క బాధ్యత. అంతేకాదు ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని పెద్దలు అంటుంటారు. అలాంటిది ఒక డెలివరీ బాయ్ నీచంగా ప్రవర్తించాడు.
బీహార్ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్ 22 లోపు ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందని తెలిపారు. ఎన్నికల ప్రక్రియను పరిశీలించేందుకు రెండు రోజుల పర్యటన కోసం ఈసీ బృందం శనివారం పాట్నాకు వచ్చింది.
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను వేల కోట్లలో మోసం చేసి లండన్ పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ అప్పగింతకు లైన్‌క్లియర్ అయినట్లు తెలుస్తోంది. భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమం అయినట్లు సమాచారం.