Gyanesh Kumar: బీహార్‌లో ఈసారి కొత్త విధానం.. బూత్‌లో ఎన్ని ఓట్లు ఉంటాయో చెప్పిన సీఈసీ
- బీహార్‌లో ఈసారి కొత్త విధానం
- బూత్‌లో ఎన్ని ఓట్లు ఉంటాయో చెప్పిన సీఈసీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీహార్‌లో ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. రెండు రోజుల పర్యటన కోసం శనివారం ఈసీ బృందం పాట్నా వచ్చింది. వివిధ పార్టీల నేతలతో సమావేశం అయ్యారు. నేతల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. ఇక ఎన్నికల నిర్వహిణపై సీఈసీ జ్ఞానేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు. నవంబర్ 22కు ముందే ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని.. ఇక ప్రతి బూత్‌లో 1,200 మంది ఓటర్లు మాత్రమే ఉంటారని తెలిపారు. ఇక అన్ని పోలింగ్ బూత్‌ల్లో మొబైల్ డిపాజిట్ సౌకర్యం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఈవీఎంలపై బ్యాలెట్ పత్రాలు నలుపు, తెలుపు రంగులో ఉంటాయని.. ఇవి గుర్తించడం కష్టం.. అందువల్ల ఈసారి సీరియల్ నెంబర్‌తో పాటు అభ్యర్థుల ఫొటోలు రంగులో ఉంటాయని తెలిపారు.
ఇక చట్టాల ఆధారంగా జైల్లో ఉన్న వ్యక్తుల నామినేషన్లు దాఖలు చేసే విధానంపై ఈసీ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. ఆదర్శప్రాయమైన ఓటర్ల జాబితా ప్రక్షాళనకు బీహార్ బూత్ స్థాయి అధికారులు కృషి చేశారంటూ ప్రశంసించారు.
Also Read
- West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
- Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
- Rajasthan: రాజస్థాన్ ఎన్నికల్లో విచిత్రం.. బీజేపీ అభ్యర్థికి ఒక్కటే ఓటు, తన ఓటు కూడా పడలేదు!
- Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
ఇది కూడా చదవండి: Mumbai: బ్లింకిట్ బాయ్ దుశ్చర్య.. డెలివరీ చేస్తూ మహిళను ఏం చేశాడంటే..!
ప్రస్తుతం బీహార్ అసెంబ్లీ గడువు నవంబర్ 22తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఈలోపే ఎన్నికల ప్రక్రియ ముగించాలని ఈసీ భావిస్తోంది. ఇక దీపావళి తర్వాత బీహార్‌లో అత్యంత గ్రాండ్‌గా జరుపుకునే ఉత్సవం ఛత్. ఈ పండుగ అక్టోబర్ 25 నుంచి 28 వరకు జరుగుతుంది. ఈ ఛత్ పండుగ కోసం ప్రపంచంలో ఎక్కడున్నా బీహారీయులంతా సొంత ఇళ్లకు వచ్చేస్తారు. ఏ రాష్ట్రంలో ఉన్నా.. ఏ దేశంలో ఉన్నా కచ్చితంగా ఛత్ పండుగ కోసం తరలివస్తారు. వచ్చిన వారు తిరిగి వెళ్లిపోకముందే ఎన్నికల ప్రక్రియను ముగించేయాలని అన్ని పార్టీల నేతలు ఎన్నికల సంఘాన్ని కోరారు. ఎక్కువ విడతల్లో కాకుండా.. తక్కువ సమయంలోనే ఎన్నికలు ముగించాలని.. దీని కారణాన ప్రచార భారం కూడా తగ్గుతుందని అభ్యర్థించాయి. ఈ నేపథ్యంలో నవంబర్ మొదటి వారంలోనే ఎన్నికల నిర్వహించాలని ఈసీ కూడా భావిస్తున్నట్లు సమాచారం. 2020లో కోవిడ్ సమయంలో 3 విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. అప్పటిలాగా కాకుండా ఈసారి ఒకటి, రెండు విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను ముగించవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి. ఏదేమైనా నవంబర్ 22లోపు ఎన్నికల ప్రక్రియను ముగిస్తామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
ఇది కూడా చదవండి: Suryakumar Yadav Regret: నా కోరిక ఎప్పటికీ నెరవేరదు.. తీవ్రంగా చింతిస్తుంటా!
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వీటిలో 2 షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) 38 షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీలు) కోసం రిజర్వు చేయబడ్డాయని జ్ఞానేష్ కుమార్ తెలిపారు. ఎన్ని నియోజకవర్గాల్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పూర్తయిందని చెప్పారు. అలాగే బూత్ స్థాయి శిక్షణ కూడా నిర్వహించినట్లు చెప్పారు. తొలిసారిగా 700 మంది బూత్ లెవల్ ఏజెంట్లకు శిక్షణ ఇచ్చిందని… ఎన్నికల సంసిద్ధతను సీఈసీ వ్యక్తం చేశారు. వచ్చే వారమే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు వర్గాలు పేర్కొంటున్నాయి
- Tags
తాజావార్తలు
-
West Bengal: బీజేపీలోకి 17 మంది తృణమూల్ రెబల్ ఎంపీలు.!
-
Ram Charan: మెగాస్టార్ ఇంట్లో వినాయక చవితి వేడుకలు.. ఫ్యామిలీతో కలిసి రామ్ చరణ్ ప్రత్యేక పూజలు! వైరల్ వీడియో..
-
Saudi Arabia: ఒక్క నదీ బారదు.. అయినా పైసలే పైసలు! ఎడారిల 1000 కోట్ల మొక్కలతో మాయ చేసిన దేశం ఇదే..
-
Disha Salian Case: దిశ సాలియన్ కేస్.. సీబీఐ ఎఫ్ఐఆర్లో ఆదిత్య ఠాక్రే, రియా పేర్లు..
-
Kabir Duhan Singh: ‘హనుమాన్ అంశ్’ బాటలోనే మరో డివైన్ మూవీ? అయోధ్య బాల రాముడి కథతో సినిమా!
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!