Trump: గాజాలో అధికారాన్ని విడిచిపెట్టండి.. లేదంటే నాశనం అవుతారు.. హమాస్‌కు మరోసారి ట్రంప్ హెచ్చరిక
- గాజాలో అధికారాన్ని విడిచిపెట్టండి
- లేదంటే నాశనం అవుతారు
- హమాస్‌కు మరోసారి ట్రంప్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాలో అధికారాన్ని విడిచిపెట్టకపోతే పూర్తిగా నిర్మూలం అవుతారని హమాస్‌ను మరోసారి ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. దీంతో శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలకు అంగీకారం తెల్పుతున్నట్లు హమాస్ ప్రకటించింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు హమాస్ బందీలను విడిచిపెట్టలేదు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నితీష్‌కుమార్ ఆరోగ్యంగా ఉన్నారో లేదో అనుమానం.. వీడియో విడుదల చేసిన తేజస్వి యాదవ్
Also Read
- South Pacific: భారీ తిమింగలం ఎటాక్.. నీట మునిగిన యాచ్
- Houthi vs Saudi: ‘‘హౌతీలు ఇస్లాంకు శత్రువులు’’.. సౌదీకి అండగా ఉండాలని పాక్ మతగురువు పిలుపు
- Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
- Smit Machchhar: ఆ టైమ్‌లో "హనుమాన్ చాలీసా" పఠించాను.. ఆ దేవుడే నన్ను కాపాడాడు..
తాజాగా అమెరికా(వాషింగ్టన్) కాలమానం ప్రకారం.. ట్రంప్ విధించిన గడువు మరో 12 గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. గాజాలో శాంతి ప్రణాళికను అమలు చేసే భాగంగా గాజాపై అధికారాన్ని, నియంత్రణను వదులుకోవడానికి నిరాకరిస్తే మాత్రం హమాస్ పూర్తిగా నిర్మూలించబడుతుందని హెచ్చరించారు. గాజాలో బాంబ్ దాడులు నిలిపివేసేందుకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇక హమాస్ శాంతికి కట్టుబడి ఉందో లేదో త్వరలో తెలుసుకుంటానన్నారు.
ఇది కూడా చదవండి: Karnataka: బీహార్ ఎన్నికల తర్వాత కర్ణాటక సీఎం మారుతారా..? బీజేపీ నేత వాదనలో నిజమెంత..?
గాజాలో శాంతి కోసం ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను హమాస్ ముందు పెట్టారు. దీనికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. అలాగే ఆయా దేశాలు ట్రంప్ ప్లాన్‌ను స్వాగతిచారు. కానీ హమాస్ స్పందించలేదు. దీంతో శుక్రవారం హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి రాకపోతే నరకం చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హమాస్ అంగీకారం తెలిపింది. అయితే తక్షణమే బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరింది. కానీ ఇప్పటి వరకు మాత్రం బందీలను విడుదల చేయలేదు. సోమవారం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
Mahatma Gandhi: గాంధీజీ హిట్లర్‌కే వార్నింగ్ ఇచ్చారా? అసలు ఆ రెండు లేఖల్లో ఏముంది!
-
CM Chandrababu: జపాన్ స్ఫూర్తితో పరిశుభ్రతా విధానాలు.. సీఎం చంద్రబాబు నాయుడు..
-
RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
-
Madras High Court: పిల్లలను కనకపోతే క్రూరత్వమా?.. విడాకుల కేసుపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
-
Repo Rate Hike: పండుగ పూట లోన్ EMI లు పెరుగుతాయా? అక్టోబర్ 7న రిజర్వ్ బ్యాంక్ ఏం చేయబోతుంది!
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!