ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి చర్చల వేళ బాంబ్ దాడులు మాత్రం ఆగలేదు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. బందీలందరినీ విడుదల చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి హమాస్ ప్రకటించింది.
జపాన్ చరిత్రలో సరికొత్త అధ్యయనం లిఖితమైంది. అమెరికా వాణిజ్యం, భద్రతా ఉద్రిక్తతల మధ్య జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి (64) ఎన్నికయ్యారు. శనివారం జరిగిన లిబరల్ డెమోక్రటిక్ పార్టీ నాయకత్వ ఎన్నికల్లో మాజీ ఆర్థిక భద్రతా మంత్రి సనే తకైచి విజయం సాధించారు.
అరేబియా సముద్రంలో తీవ్రమైన ‘శక్తి’ తుఫాన్ ఏర్పడింది. ప్రస్తుతం తీరం వైపునకు దూసుకొస్తోందని కేంద్ర వాతావరణ శాఖ తెలిపింది. 420 కి.మీ దూరంలో తుఫాన్ కేంద్రీకృతమైనట్లుగా పేర్కొంది. గుజరాత్, పశ్చిమ-నైరుతి దిశగా తుఫాన్ కదులుతోందని వెల్లడించింది.
ఇటలీ విహారయాత్రలో విషాదం చోటుచేసుకుంది. నాగ్‌పూర్‌కు చెందిన దంపతులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో వారి కుమార్తెతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోందని భారత రాయబార కార్యాలయం తెలిపింది.
భారత న్యాయ వ్యవస్థపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో నడవడం లేదని.. చట్టబద్ధమైన పాలనతోనే నిర్వహించబడుతుందని తెలిపారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా గవాయ్ మారిషస్‌లో పర్యటిస్తున్నారు.
ట్రంప్ ప్రణాళికను అంగీకరిస్తున్నట్లు హమాస్ ప్రకటించింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తామని వెల్లడించింది. దీంతో గాజాలో శాంతికి పునాది పడినట్లైంది. అయితే తాజాగా హమాస్‌కు ఇజ్రాయెల్ కీలక సూచన చేసింది. తక్షణమే బందీలను విడుదల చేయాలని కోరింది. అలాగే పాలస్తీనా ఖైదీలను కూడా విడుదల చేస్తున్నట్లు తెలిపింది.
పసిడి ప్రియులకు బంగారం ధరలు షాకిస్తున్నాయి. పండగల వేళ బంగారం కొందామనుకుంటున్న గోల్డ్ లవర్స్‌కు ధరలు హడలెత్తిస్తున్నాయి. దసరాకు ముందు ఠారెత్తించిన ధరలు.. దీపావళి నాటికైనా తగ్గుతాయేమోనని భావిస్తున్న వేళ మరోమారు ధరలు దూసుకుపోతున్నాయి.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ (52) మరణంపై తలెత్తిన అనుమానాలే నిజమవుతున్నాయి. జుబీన్ గార్గ్ మరణానికి ముందు ఆయనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. పైగా జుబీన్ గార్గ్ మంచి ఈతగాడు కూడా. అలాంటిది ఆయన హఠాత్తుగా ప్రాణాలు కోల్పోవడం అస్సామీయులనే కాకుండా యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
బీహార్‌లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఎన్నికల అధికారులు ఈరోజు, రేపు బీహార్‌లో పర్యటించనున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. గాజాలో శాంతి స్థాపనకు పురోగతి సాధించారంటూ ట్రంప్‌ను మోడీ అభినందించారు. ఈ మేరకు ఎక్స్‌లో మోడీ పోస్ట్ చేశారు. శాశ్వత, న్యాయమైన శాంతి కోసం చేసే ప్రయత్నాలకు భారతదేశం ఎప్పుడూ గట్టిగా మద్దతు ఇస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.