పసిడి ప్రియులకు మళ్లీ షాక్. దీపావళి నాటికైనా బంగారం ధరలు తగ్గుతాయేమోనని అనుకుంటున్న వాళ్లకు గోల్డ్ రేట్స్ షాక్‌ల మీద షాక్‌లు ఇస్తోంది. రోజురోజుకి జెట్ స్పీడ్‌లో ధరలు దూసుకుపోతున్నాయి. దీంతో బంగారం కొనాలంటేనే గోల్డ్ లవర్స్ హడలెత్తిపోతున్నారు.
బీహార్ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. సోమవారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయనుంది. శని, ఆదివారాల్లో ఎన్నికల బృందం బీహార్‌లో పర్యటించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించింది.
మణిపూర్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గతేడాది అల్లర్లతో మణిపూర్ అట్టుడికింది. పదులకొద్ది ప్రాణాలు కోల్పోయారు. భారీగా ఆస్తి నష్టం కూడా జరిగింది. ఇక ఈ ఏడాది ఫిబ్రవరి 9న ముఖ్యమంత్రి పదవికి బిరెన్ సింగ్ రాజీనామా చేయడంతో ప్రభుత్వం పడిపోయింది.
అస్సామీ గాయకుడు జుబీన్ గార్గ్ మరణం అస్సామీయులనే కాకుండా యావత్తు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణ వార్త తెలియగానే లక్షలాది మంది అభిమానులు కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఆకస్మిక మరణం పలు అనుమానాలకు దారి తీసింది.
ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసి మంగళవారంతో రెండేళ్లు పూర్తవుతుంది. అనంతరం గాజాపై ఏకధాటిగా యుద్ధం చేస్తూనే ఉంది. ఇలాంటి తరుణంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. 20 పాయింట్ల ప్రణాళికను ప్రతిపాదించారు. దీనికి ప్రస్తుతం హమాస్, ఇజ్రాయెల్ అంగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈజిప్టు వేదికగా సోమవారం కీలక సమావేశం జరగబోతుంది. ఈజిప్టు రాజధాని కైరోలో చర్చలు జరగనున్నాయి.
ఢిల్లీ మెట్రో రెజ్లింగ్ అరేనాగా మారింది. ఇద్దరు ప్రయాణికులు డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్‌కు దిగారు. కిక్కిరిసి వెళ్తున్న కోచ్‌లో సడన్‌గా ఇద్దరు ప్యాసింజర్స్ కొట్లాటకు దిగారు. ఇద్దరూ కూడా ఒకకినొకరు తన్నుకోవడం.. కొట్టుకోవడం కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
జైపూర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. సవాయి మాన్ సింగ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 8 మంది రోగులు సజీవదహనం అయ్యారు. మంటలు అంటుకోగానే ఆస్పత్రి సిబ్బంది పారిపోయారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ప్రపంచ పటంలో తన స్థానాన్ని నిలుపుకోవాలంటే పాకిస్థాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం మానేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపకపోతే పాకిస్థాన్‌ను ప్రపంచ పటంలో లేకుండా చేస్తామంటూ తీవ్ర వార్నింగ్ ఇచ్చారు.
కర్ణాటకలో ప్రస్తుతం కుల సర్వే నడుస్తోంది. వెనుకబడిన తరగతుల కమిషన్ చేపట్టిన సామాజిక-ఆర్థిక సర్వే సెప్టెంబర్ 22న ప్రారంభమై అక్టోబర్ 7న ముగియనుంది. ఇక సర్వేలో 60 ప్రశ్నలు సంధించారు. అయితే కుల సర్వేలో ఆభరణాలపై అడిగిన ప్రశ్నకు స్వయంగా డిప్యూటీ సీఎం డీకే.శివకుమారే నిరాకరించారు.
పాకిస్థాన్‌లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 4.6గా నమోదైంది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం... ఆదివారం సాయంత్రం 06:59 గంటలకు భూకంపం సంభవించింది.