Marco Rubio: బందీలను విడిపించడమే లక్ష్యం.. నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు.. గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
- బందీలను విడిపించడమే లక్ష్యం
- నెక్ట్స్ ప్లానేంటో ఇంకా తెలియదు
- గాజాపై మార్కో రూబియో కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గాజాలో ఇంకా యుద్ధం ముగియలేదని.. బందీలను బయటకు తీసుకురావడమే తన తొలి ప్రాధాన్యత అని అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడారు. ట్రంప్ ప్రణాళికకు, బందీలను విడుదల చేయడానికి హమాస్ ప్రాథమికంగా అంగీకరించిందని.. సమాచారం సమన్వయం చేసుకోవడానికి సమావేశాలు జరుగుతున్నాయ తెలిపారు. హమాస్ దగ్గర ఉన్న బందీలను విడుదల చేయడమే మొదటి దశ అని పేర్కొన్నారు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అనేదానిపై వివరాలు ఇంకా చర్చించుకోవాల్సి ఉందని చెప్పారు.
ఇది కూడా చదవండి: Trump: గాజాలో అధికారాన్ని విడిచిపెట్టండి.. లేదంటే నాశనం అవుతారు.. హమాస్‌కు మరోసారి ట్రంప్ హెచ్చరిక
Also Read
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
ఇదిలా ఉంటే హమాస్‌కు ట్రంప్ విధించిన గడువు మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. గాజాలో అధికారాన్ని విడిచిపెట్టకపోతే పూర్తిగా నిర్మూలం అవుతారని వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి అంగీకరించకపోతే నరకం చూస్తారని హమాస్‌ను ఇటీవల ట్రంప్ హెచ్చరించారు. దీంతో శుక్రవారం రాత్రి ట్రంప్ ప్రణాళికలోని కొన్ని అంశాలకు అంగీకారం తెల్పుతున్నట్లు హమాస్ ప్రకటించింది. బందీలందరినీ ఒకేసారి విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు హమాస్ బందీలను విడిచిపెట్టలేదు.
ఇది కూడా చదవండి: Tejashwi Yadav: నితీష్‌కుమార్ ఆరోగ్యంగా ఉన్నారో లేదో అనుమానం.. వీడియో విడుదల చేసిన తేజస్వి యాదవ్
తాజాగా అమెరికా(వాషింగ్టన్) కాలమానం ప్రకారం.. ట్రంప్ విధించిన గడువు మరో 12 గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో మరోసారి హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. గాజాలో శాంతి ప్రణాళికను అమలు చేసే భాగంగా గాజాపై అధికారాన్ని, నియంత్రణను వదులుకోవడానికి నిరాకరిస్తే మాత్రం హమాస్ పూర్తిగా నిర్మూలించబడుతుందని హెచ్చరించారు. గాజాలో బాంబ్ దాడులు నిలిపివేసేందుకు ఇజ్రాయెల్ కట్టుబడి ఉందని తెలిపారు. ఇక హమాస్ శాంతికి కట్టుబడి ఉందో లేదో త్వరలో తెలుసుకుంటానన్నారు.
గాజాలో శాంతి కోసం ట్రంప్ 20 పాయింట్ల ప్రణాళికను హమాస్ ముందు పెట్టారు. దీనికి ఇజ్రాయెల్ అంగీకారం తెలిపింది. అలాగే ఆయా దేశాలు ట్రంప్ ప్లాన్‌ను స్వాగతిచారు. కానీ హమాస్ స్పందించలేదు. దీంతో శుక్రవారం హమాస్‌ను ట్రంప్ హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం 6 గంటలలోపు శాంతి ఒప్పందానికి రాకపోతే నరకం చూస్తారని వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి హమాస్ అంగీకారం తెలిపింది. అయితే తక్షణమే బందీలను విడుదల చేయాలని ఇజ్రాయెల్ కోరింది. కానీ ఇప్పటి వరకు మాత్రం బందీలను విడుదల చేయలేదు. సోమవారం విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తాజావార్తలు
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
-
BSNL Insurance Offer: BSNL కస్టమర్లకు ఉచిత ఇన్సూరెన్స్.. రూ.1 లక్ష యాక్సిడెంటల్ డెత్ కవర్, రూ.10 వేల సైబర్ ప్రొటెక్షన్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!