ఢిల్లీ మెట్రో రెజ్లింగ్ అరేనాగా మారింది. ఇద్దరు ప్రయాణికులు డబ్ల్యూడబ్ల్యూఈ తరహాలో ఫైటింగ్‌కు దిగారు. కిక్కిరిసి వెళ్తున్న కోచ్‌లో సడన్‌గా ఇద్దరు ప్యాసింజర్స్ కొట్లాటకు దిగారు. ఇద్దరూ కూడా ఒకకినొకరు తన్నుకోవడం.. కొట్టుకోవడం కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Jaipur: జైపూర్ ఆస్పత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ఆరుగురు రోగులు మృతి
ఢిల్లీ మెట్రోలో ప్రయాణం చేస్తుండగా ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. అంతలోనే ఒకరికొకరు భౌతికదాడులకు దిగారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను సహచర ప్రయాణికుడు మొబైల్‌లో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. వీడియోలో ఇద్దరు తన్నుకోవడం కనిపించింది. అనంతరం కొందరు ప్రయాణికులు సర్థిచెప్పి విడదీశారు. అయితే దుర్భాషలాడడంతోనే ఈ గొడవకు కారణమైనట్లుగా తెలుస్తోంది. కోపంతో తన్నినట్లుగా సమాచారం.
ఇది కూడా చదవండి: Supermoon : ఆకాశంలో అరుదైన అద్భుతం రేపు, ఎల్లుండి
ఇక ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీ మెట్రోలో ఇది సాధారణమే అని ఒకరు వ్యాఖ్యానించగా.. ఢిల్లీ మెట్రో చాలా అందంగా ఉందంటూ మరొకరు వ్యాఖ్యానించారు. మానవుల్లో మానవత్వం క్రమంగా తగ్గిపోతుందని.. అమర్యాద యుగం వైపు ప్రజలు వెళ్తున్నారని ఇంకొక నెటిజన్ వ్యాఖ్యానించాడు. ఢిల్లీ మెట్రోలో రియల్ ఫైట్‌ను నేరుగా చూడకపోవడం చాలా బాధగా ఉందని చమత్కరించాడు.
Kalesh b/w Uncle and a guy inside delhi metro. pic.twitter.com/xt6NMKi5F1
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 2, 2025