భారీ వర్షాలతో తమిళనాడు అతలాకుతలం అయింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇక చెన్నైలో ఆరెంజ్ అలర్ట్ అమల్లో ఉంది.
రాష్ట్రపతి భవన్ అనగానే గుర్తొచ్చేది ఢిల్లీ. ఇక శీతాకాల విడిది కోసం హైదరాబాద్‌కు వచ్చిప్పుడు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో బస చేస్తారు. ఈ రెండు కాకుండా శబరిమలలో కూడా అధికారిక రాష్ట్రపతి భవనం ఉందని ఎంత మందికి తెలుసు. శబరిమలలో రాష్ట్రపతి భవనం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారా? మీరు చదువుతున్నది నిజమే. దీని బ్యాగ్రౌండ్ తెలియాలంటే అయితే ఈ వార్త చదవాల్సిందే.
దీపావళి బోనస్ వస్తుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పండుగ రానే వచ్చింది. కానీ బోనస్ మాత్రం అకౌంట్లలో పడలేదు. దీంతో ఒక్కసారిగా ఉద్యోగులకు చిర్రెత్తింది. డ్యూటీ పక్కన పెట్టి నిరసనకు దిగారు. అంతేకాకుండా అన్ని టోల్ గేట్లు ఎత్తేసి ఉచితంగా విడిచిపెట్టేశారు. దీంతో ఒక్కసారిగా యాజమాన్యం దిగొచ్చి కాళ్లబేరానికి వచ్చింది.
బెంగళూరు రోడ్లపై వివాదం తలెత్తిన వేళ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే.శివకుమార్‌ను బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా తన మేనల్లుడి వివాహానికి రావాల్సిందిగా శివకుమార్‌ను ఆహ్వానించారు. అంతకుముందు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కూడా ఆయన నివాసంలో కలిసి ఆహ్వానించారు.
దీపావళి రోజున నవీ ముంబైలో ఘోర విషాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి 12:30 గంటల సమయంలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 10 మంది గాయాల పాలయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తున్నారు.
జపాన్ చరిత్రలో సనే తకైచి సరికొత్త రికార్డ్ సృష్టించారు. తొలి మహిళా ప్రధానిగా సనే తకైచి ఎన్నికయ్యారు. మంగళవారం జపాన్ పార్లమెంట్ దిగువ సభలో జరిగిన ఓటింగ్‌లో సనే తకైచి విజయం సాధించారు. మొదటి రౌండ్ ఓటింగ్‌లో ఊహించని విధింగా మెజార్టీ సాధించారు.
త్వరలోనే చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్-అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీకానున్నారు. దక్షిణ కొరియా వేదికగా ఈ సమావేశం జరగనుంది. ఇప్పటికే చైనాపై 55 శాతం సుంకం విధించిన ట్రంప్.. తాజాగా మరో బాంబ్ పేల్చారు.
బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. రెండు రోజులు శాంతించిన ధరలు.. దీపావళి ముగియగానే తన పంథా కొనసాగిస్తోంది. మళ్లీ జెట్ స్పీ్డ్లా ధరలు దూసుకెళ్తున్నాయి. ఈరోజు తులం గోల్డ్‌పై రూ.2,080 పెరగగా.. వెండి ధర మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. కిలో వెండిపై రూ.2,000 తగ్గింది.
దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. వాతావరణం పూర్తిగా కలుషితం అయిపోయింది. దీనికి దీపావళి పండుగ తోడైంది. నిన్నటిదాకా ఒకెత్తు.. ఈరోజు మరొకెత్తుగా మారిపోయింది.
వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ సహనం కోల్పోయారు. ఓ రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు నోటికి పని చెప్పారు. బుడాపెస్ట్‌లో ట్రంప్-పుతిన్ భేటీని ఎవరు నిర్ణయించారంటూ ఓ రిపోర్టర్ ప్రశ్న అడిగాడు. అంతే వ్యక్తిగత కోపమో.. లేదంటే ప్రెస్టేషనో తెలియదు గానీ బూతు పదం ఉపయోగించారు.