బెంగళూరులో ఓ షాకింగ్ సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో లివ్-ఇన్ జంట అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఆనేకల్‌లోని కల్లబాలులోని ఓ ఇంట్లో శవాలుగా కనిపించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
బెంగళూరులోని ఒక అద్దె ఇంట్లో జంట నివాసం ఉంటుంది. మంగళవారం శవాలుగా కనిపించారని పోలీసులు తెలిపారు. దీపావళి రోజున (అక్టోబర్ 20) ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లుగా తెలుస్తోంది. ఘర్షణ తర్వాత ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఆదివారం నుంచే ఇంటి తలుపులు తీయడం లేదని ఇరుగుపొరుగు వారు చెప్పారు. అనుమానం రావడంతోనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇంటికొచ్చి తలుపులు పగలగొట్టి చూడగా ఇద్దరి మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి.
ఇది కూాడా చదవండి: Modi-Trump: బలపడుతున్న భారత్-అమెరికా బంధం.. సుంకాలు తగ్గే అవకాశం
మృతులిద్దరూ ఒడిశాకుచెందిన రాకేష్ కుమార్ (23), సీమా నాయక్ (25) గా పోలీసులు గుర్తించారు. ఉద్యోగాల కోసం మూడు నెలల క్రితం అనేకల్‌కు వచ్చారని స్నేహితులు తెలిపారు. 10 రోజుల క్రితమే జంట అద్దె ఇల్లు తీసుకున్నట్లు వెల్లడించారు. రాకేష్ కుమార్ సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో హౌస్ కీపింగ్ పని చేస్తుండగా.. సీమా నాయక్ ఇంటి సమీపంలో ఉన్న సూపర్ మార్కెట్‌లో పని చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూాడా చదవండి: Tejashwi Yadav: తేజస్వి యాదవ్ హామీల వర్షం.. జీవికా దీదీలకు రూ.30 వేలు ఇస్తామని ప్రకటన
తొలుత రాకేష్ కుమార్ ఉరి వేసుకున్నాడు. వెంటనే సీమా నాయక్ అప్రమత్తమై కత్తి తీసుకుని ఉరి తాడును కత్తిరించే ప్రయత్నం చేసింది. అప్పటికే అతడు చనిపోయాడని తెలుసుకుని ఆమె కూడా ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. రాకేష్ కుమార్ ఆదివారం మద్యం తాగి వచ్చి భాగస్వామితో గొడవకు దిగినట్లుగా సమాచారం. అనంతరం అర్ధరాత్రే ఇద్దరూ ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
సీమా నాయక్‌కు అక్రమ సంబంధం ఉందని రాకేష్ కుమార్ అనుమానించాడని.. సీమా వేరే వ్యక్తికి డబ్బులు బదిలీ చేసిందని రాకేష్ కుమార్ స్నేహితుడు జోరా నాయక్ తెలిపాడు. అక్రమ సంబంధంపై ప్రతిరోజూ ఇద్దరి మధ్య గొడవులు జరుగుతున్నాయని చెప్పాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఒడిశాలోని బంధువులకు సమాచారం అందించారు.