Bihar Elections: ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్.. కాసేపట్లో ఉమ్మడి ప్రకటన
- ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్
- కాసేపట్లో ఉమ్మడి ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మొత్తానికి బీహార్ విపక్ష కూటమిలో చోటుచేసుకున్న సంక్షోభానికి తెర పడింది. కూటమి పార్టీలన్నీ ఒక్కతాటిపైకి వచ్చాయి. అశోక్ గెహ్లాట్ జరిపిన దైత్యం విజయవంతం అయింది. దీంతో ఇండియా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్ అభ్యర్థిత్వాన్ని అన్ని పార్టీలు అంగీకరించాయి. గురువారం ఉదయం 11 గంటలకు ఇండియా కూటమి పార్టీలు సంయుక్త ప్రెస్‌మీట్ నిర్వహించి ఈ మేరకు అధికారిక ప్రకటన చేయనున్నారు.

Also Read
- Bhajan Lal Sharma: రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో బీజేపీ హవా.. ప్రధాని మోడీ పాపులారిటీ కలిసొచ్చిందన్న సీఎం
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్‌లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
బీహార్ ఎన్నికల షెడ్యూల్ విడుదల కాకముందు వరకు ఇండియా కూటమి ఏకంగానే ఉంది. అయితే సీట్ల పంపకాల విషయంలో తేడా రావడంతో చివరి నిమిషంలో ఎవరి దారి వారిదే అన్నట్టుగా విడివిడిగా నామినేషన్లు వేశారు. దీంతో అధికారంలోకి వద్దామనుకున్న కూటమి ఆశలు గల్లంతయ్యాయి. మరోవైపు విపక్ష కూటమి బలహీనతను అధికార కూటమి క్యాష్ చేసుకుంటోంది. మరోసారి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రణాళికలు వేసుకుంటోంది. దీంతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది. సీనియర్ నాయకుడు. రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌ను రంగంలోకి దింపింది. అంతే హుటాహుటినా అశోక్ గెహ్లాట్ పాట్నాలో వాలిపోయారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఇంట్లో ఇండియా కూటమి పార్టీలతో చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వి యాదవ్‌ను ఏక కంఠంతో అంగీకారం తెలిపాయి. దీంతో కూటమిలో నెలకొన్న సంక్షోభం ఒక్కసారిగా పటాపంచలు అయింది.
ఇది కూడా చదవండి: PM Modi: ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ దూరం! కారణమిదే!
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. నవంబర్ 6, 11 తేదీల్లో పోలింగ్ జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 14న విడుదల కానున్నాయి. ఇక ప్రధాని మోడీ అక్టోబర్ 24న ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. రాష్ట్రంలో పలుచోట్ల ఎన్నికల ర్యాలీలు నిర్వహించనున్నారు.
ఇది కూడా చదవండి: Delhi Encounter: ఢిల్లీలో భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు గ్యాంగ్‌స్టర్లు హతం
తాజావార్తలు
-
BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
India Sovereign Cloud: ఆధార్.. యూపీఐ.. డిజిలాకర్.. కీలక డేటా కోసం కేంద్రం భారీ సెక్యూరిటీ ప్లాన్.. ఇదే ‘సావరెన్ క్లౌడ్’!
-
Women’s Asia Cup 2026: భారత క్రికెట్ గర్వపడే క్షణాలు.. మహిళా జట్టు అద్భుతం: ప్రధాని మోడీ
-
Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!