దీపావళి తర్వాత స్టాక్ మార్కెట్‌లో కొత్త జోష్ కనిపిస్తోంది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం కళకళలాడుతోంది. గురువారం ఉదయం మార్కెట్ ప్రారంభం కాగానే సూచీలు భారీ లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్, నిఫ్టీ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 702 పాయింట్ల లాభపడి 85,128 దగ్గర కొనసాగుతుండగా.. నిఫ్టీ 208 పాయింట్లు లాభపడి 26,077 దగ్గర కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: PM Modi: ఆసియాన్ శిఖరాగ్ర సమావేశానికి మోడీ దూరం! కారణమిదే!
శ్రీరామ్ ఫైనాన్స్, టెక్ మహీంద్రా, టైటాన్ కంపెనీ, టీసీఎస్, టాటా స్టీల్ నిఫ్టీలో ప్రధాన లాభాలను ఆర్జించగా… మాక్స్ హెల్త్‌కేర్, మారుతి సుజుకి, అపోలో హాస్పిటల్స్ నష్టపోయాయి. ఇక బీఎస్‌ఇ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని ఇతర రంగాల సూచీలు ఐటి ఇండెక్స్ 2 శాతం పెరిగి గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం.. మహిళపై గ్యాంగ్ రేప్ చేసి దోపిడీ