Suresh Maddala
Author- NTV Telugu-
Japan Floods: జపాన్ను ముంచెత్తిన వరదలు.. ఎమర్జెన్సీ అలర్ట్ జారీ
ఉత్తర జపాన్‌పై ప్రకృతి మరోసారి ప్రకోపించింది. ఇప్పటికే ఈ ఏడాది ప్రారంభంలో భారీ భూకంపంతో కోలుకోలేని దెబ్బ తగిలింది. దాంట్లో నుంచి ఇప్పుడిప్పుడే బయట పడుతున్న తరుణంలో మరోసారి ప్రకృతి కన్నెర్ర జేసింది. శనివారం జపాన్‌లోని ఉత్తర మధ్య ప్రాంతమైన నోటోలో భారీ వర్షం కురిసింది. -
Amar Preet Singh: ఎయిర్ స్టాఫ్ చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ నియామకం
ఎయిర్ స్టాఫ్ చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ నియమితులయ్యారు. ప్రస్తుత ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి సెప్టెంబర్ 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత భారత వైమానిక దళానికి చీఫ్‌గా అమర్ ప్రీత్ సింగ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అమర్ ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం నుంచి నియామకం అమలులోకి వస్తోందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. -
Bengaluru: ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం.. ఇంజనీరింగ్ విద్యార్థి అరెస్ట్
బెంగళూరు ఉమెన్స్ కాలేజీ వాష్‌రూమ్‌లో మొబైల్ కలకలం సృష్టించింది. కుంబల్‌గోడులోని ఏసీఎస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాల వాష్‌రూమ్‌లో అమ్మాయిల దృశ్యాలను 21 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థి మొబైల్లో షూట్ చేశాడు. దీన్ని గమనించిన సహా విద్యార్థులు.. నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. -
Malayalam: మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ కన్నుమూత
మలయాళ నటి కవియూర్ పొన్నమ్మ (79) కన్నుమూశారు. వృద్ధాప్య సంబంధిత వ్యాధులతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం ఆమె మృతిచెందారు.ఆరు దశాబ్దాలకు పైగా విశిష్టమైన కెరీర్‌ను కొనసాగించింది. కొన్ని నెలలుగా వయోభారంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరింది. పొన్నమ్మ మృతి పట్ల కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. -
Kejriwal: హర్యానాలో ఆప్ మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పడదు
ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ హర్యానాలో ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పలు నియోజకవర్గాల్లో ఎన్నికల ర్యాలీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. హర్యానాలో ఏ ప్రభుత్వం కొలువుదీరినా ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుతోనే సాధ్యమవుతుందన్నారు. ఆప్ మంచి స్థాయిలో స్ధానాలను చేజిక్కించుకుంటుందని తెలిపారు. తమ పార్టీ మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదని కేజ్రీవాల్ చెప్పుకొచ్చారు. -
Kolkata: సందీప్ ఘోష్‌కు సీబీఐ కోర్టు షాక్.. కస్టడీ పొడిగింపు
కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై ఇంకా ఆందోళనలు కొనసాగుతున్నాయి. న్యాయం చేయాలంటూ వైద్యులు వైద్యులు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు సీబీఐ కోర్టు షాకిచ్చింది. -
Rishikesh station: రైల్వేస్టేషన్ ఫ్లాట్‌ఫామ్‌పై పాము హల్చల్.. ప్రయాణికులు పరుగులు
ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్ రైల్వేస్టేషన్లో ఓ పాము హల్చల్ సృష్టించింది. 6 అడుగుల పొడవైన పాము కలకలం సృష్టించింది. దీంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. భయంతో వణికిపోయారు. కొందరు పరుగులు తీశారు. -
Lalu Yadav: ఉద్యోగాల స్కామ్ కేసులో లాలూపై ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి అనుమతి
బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అనుమతి ఇచ్చారు. ఉద్యోగాల కోసం భూమి కేసులో ఈ ప్రాసిక్యూషన్‌కు రాష్ట్రపతి ఆమోదించారు. ఉద్యోగాల కోసం భూమి కేసులో ఆయనను విచారించేందుకు సీబీఐ అనుమతిని ఢిల్లీ కోర్టుకు సమర్పించింది. -
Pune: చూస్తుండగానే రోడ్డు మధ్యలో దిగిపోయిన డ్రైనేజీ ట్యాంకర్.. వీడియో వైరల్
మహారాష్ట్రలోని పూణెలో వింతైన సంఘటన చోటుచేసుకుంది. పూణె నగరంలోని బుద్వార్ పేత్ ప్రాంతంలోని సిటీ పోస్టాఫీసు ఆవరణలో ఒక డ్రైనేజీ ట్యాంకర్ ఉంది. ట్రక్కు పూణె మునిసిపల్ కార్పొరేషన్‌కి చెందినది. డ్రైనేజీ క్లీనింగ్ పని కోసం అక్కడ ఆగి ఉంది. -
Maharashtra: బస్సు-ట్రక్కు ఢీ.. ఆరుగురు మృతి.. 17 మందికి గాయాలు
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. జాల్నా జిల్లాలో బస్సు-ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. 17 మందికి గాయాలయ్యాయి. రాష్ట్ర రవాణా సంస్థ బస్సు గేవ్రాయ్ నుంచి జాల్నాకు వెళ్తుండగా అంబాద్ నుంచి నారింజ పండ్లతో వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ట్రక్కు డ్రైవర్ ఓవర్టేక్ చేయడం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక నివేదికలో వెల్లడైంది.
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?