Delhi: కేంద్ర పశుసంవర్ధక శాఖ కీలక నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ఈ మధ్య ఎక్కువ వినిపిస్తున్న మాట కులగణన. ఆయా రాష్ట్రాలు ఇప్పటికే కులగణన చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. అలాగే విపక్ష పార్టీలు కూడా కులగణన చేపట్టాలని ప్రభుత్వాలను కోరుతున్నాయి. ఇదిలా ఉంటే మనుషులనే కాదు.. పశువులను కూడా లెక్కించేందుకు కేంద్రం సిద్ధపడింది. ఈ మేరకు కేంద్ర పశుసంవర్ధక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కల మాదిరిగానే ఈ పశుగణన చేపట్టాలని డిసైడ్ అయింది. ఈ పశుగణనను సెప్టెంబర్-డిసెంబర్ నెలల్లో నిర్వహించాలని నిర్ణయించింది. మొబైల్ టెక్నాలజీ వినియోగంతో ఈ ప్రక్రియను చేపట్టనున్నట్లు తెలుస్తోంది.
గురువారం పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ కార్యదర్శి అల్కా ఉపాధ్యాయ అధ్యక్షతన రాష్ట్రాలు-కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన సీనియర్ అధికారులు, సాంకేతిక కమిటీ సభ్యులతో మంత్రిత్వ శాఖ సెన్సిటైజేషన్ సమావేశాన్ని నిర్వహించింది. ఆయా రాష్ట్రాల సహకారంతో 21వ పశుగణనను పూర్తి చేయాలని నిర్ణయించినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది.
Also Read
- Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
- RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
- 165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
అన్ని గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ చేపట్టనున్నారు. పలు జాతులకు చెందిన పెంపుడు జంతువులు, పక్షులు, ఇతర జీవజాతులు వయసు, లింగం తదితర వివరాలను సేకరించి డిజిటలైజేషన్ చేస్తారు. దేశంలో మొత్తం పశుసంపదపై గణాంకాలు సేకరించడం ద్వారా పశుసంవర్ధక శాఖలో పలు కార్యక్రమాల అమలుకు విధాన రూపకల్పనలో ఇది దోహదపడనుంది.
తాజావార్తలు
-
Irumudi Movie Bridge: కుప్పకూలిన ‘ఇరుముడి’ సినిమా బ్రిడ్జి!
-
Maruti Suzuki: చౌకైన మారుతి కార్లలోనూ ADAS.. సుజుకీ మాస్టర్ ప్లాన్..!
-
RBI FD Rules 2026: బ్యాంకు ఎఫ్డీలపై ఆర్బీఐ కొత్త రూల్స్.. ప్రతీ రోజు వడ్డీ రేట్లు వెల్లడించాల్సిందే..
-
Rohit-Kohli Records: గువాహటిలో రో-కో రికార్డుల జాతర.. దిగ్గజాల ఖాతాలో ఎన్నో ప్రత్యేకతలు!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
ట్రెండింగ్
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!