Seediri Appalaraju: మెడికల్ కాలేజ్ లు ప్రైవేటీకరణ చేయొద్దని మేము ఆందోళన చేస్తుంటే ప్రభుత్వ హాస్పిటల్ ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చి వారి జీతభత్యాలు రెండేళ్లు భరిస్తామని చెబుతున్నారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. ఐదేళ్లు మూడు లక్షల కోట్లు అప్పు చేయడం విధ్వంసమైతే.. 16 నెలలో రెండు లక్షలు కోట్లు అప్పు చేయడం విధ్వంసం కాదా చంద్రబాబు.. నాడు- నేడు కార్యక్రమం విధ్వంసం అని చంద్రబాబు చెప్తున్నారు.. ఇంగ్లీష్ మీడియం తెచ్చింది మేము.. మీరు ఆపేశారని ఆరోపించారు.
Read Also: Madhya Pradesh: 16 ఏళ్ల బాలిక అశ్లీల వీడియో వైరల్.. మధ్యప్రదేశ్‌లో టెన్షన్ టెన్షన్..
ఇక, చంద్రబాబు మాటలు ఆడితే విధ్వంసం గత ప్రభుత్వం చేసిందని అంటున్నాడు.. రాష్ట్రాన్ని మీరు పూర్తిగా నాశనం చేస్తున్నారని సీదిరి అప్పలరాజు అన్నారు. హోం మంత్రి అనిత, సత్యకుమార్, బాలకృష్ణ లేని మెడికల్ కాలేజ్ లు ఎక్కడి నుంచి తేవాలని అంటున్నారు, జగన్ వచ్చి చూపించారని ప్రజలకు తెలిసింది.. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు సెల్ఫ్ ఫైనాన్స్ కోటా కింద జగన్మోహన్ రెడ్డి 50 శాతం సీట్లు కేటాయిస్తే.. ఎన్నికల తర్వాత సెల్ఫ్ ఫైనాన్స్ కూడా తీసేసి పేదవాళ్ళకి సీట్లు ఇస్తామన్నారు.. ఇప్పుడు పూర్తిగా పీజీ సీట్లు తీసేశారని మాజీ మంత్రి అప్పలరాజు వెల్లడించారు.
Read Also: Samantha : సమంత పెళ్లిని ఇండస్ట్రీ పట్టించుకోలేదెందుకు?
అయితే, ఇది మాట తప్పడం కాదా పవన్ కళ్యాణ్.. సూక్తులు చెప్పడం కాదు నిజాలు చెప్పాలని వైసీపీ నేత సీదిరి అప్పలరాజు తెలిపారు. ప్రశ్నిస్తామని వచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు.. మాట్లాడితే చాలు చంద్రబాబు డబ్బులు లేవు ఖజానా ఖాళీ అని చెబుతున్నారు.. పుష్కరాలకు రూ. 5000 కోట్లు అని చెప్పిన వారు మెడికల్ కాలేజ్ లకూ పెట్టలేరా అని ప్రశ్నించారు. నాబార్డ్ వారు మెడికల్ కాలేజ్ లకు డబ్బులు ఇస్తామని అంటున్నారు.. వాటిని తీసుకొని మెడికల్ కాలేజ్ లు పూర్తి చేయండి అని సూచించారు.
Read Also: LIC: రూ.2 కోట్లు ఇవ్వడానికి సిద్ధమైన ఎల్‌ఐసీ.. ప్లాన్ వివరాలు ఇవే!
అలాగే, ప్రైవేట్ వ్యక్తులకు హాస్పిటల్స్ ని ఇవ్వడం వలన పేద వారికీ భారం అవుతుందని సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. OP ఫ్రీ అయితే మిగతా వాటికి లక్షలలో డబ్బులు వసూల్ చేస్తారు.. వారి బినామీలకు ఈ హాస్పిటల్స్ కట్టబెట్టడానికి ఇది చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వం చేసే ప్రతి పథకంలోని స్కాంని రాబోయే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వసూలు చేస్తుందన్నారు. ఈ నెల 16వ తేదీన గవర్నర్ ని కలిసి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా సేకరించిన ప్రజల కోటి సంతకాల ప్రతుల వినతిని ఇస్తారని సీదిరి అప్పలరాజు వెల్లడించారు.