కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ (Sonia Gandhi) రాజ్యసభకు (Rajya Sabha) పోటీ చేయాలని డిసైడ్ అయ్యారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని ఆమె నిర్ణయం తీసుకున్నారు.
సెంట్రల్ ఢిల్లీలోని (Delhi) పటేల్ నగర్ రైల్వే స్టేషన్లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ ప్యాసింజర్ రైల్లో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. మంటలు అంటుకున్న సమయంలో రైలు బోగీలు అన్ని ఖాళీగా ఉన్నాయి.
సినీ నటి జయా బచ్చన్‌కు (Jaya Bachchan) మరోసారి రాజ్యసభ సీటు దక్కింది. ఈ మేరకు సమాజ్‌వాదీ పార్టీ ఆమె పేరును ప్రకటించింది. జయా బచ్చన్ (75 )తో పాటు మరో ఇద్దరి పేర్లను ఎస్పీ వెల్లడించింది.
డిమాండ్ల పరిష్కారం కోసం ఢిల్లీలో (Delhi) నిరసన చేపడుతున్న అన్నదాతలపై టియర్ గ్యాస్ (Tear Gas) ప్రయోగించడాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) తప్పుపట్టారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది.
ప్రధాని మోడీ (PM Modi) రెండ్రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లారు. ప్రస్తుతం ఆయన అబుదాబిలో (Abu Dhabi) పర్యటిస్తున్నారు. కానీ అక్కడ పెద్ద ఎత్తున భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తమ డిమాండ్ల పరిష్కారం కోసం అన్నదాతలు దేశ రాజధాని ఢిల్లీకి (Delhi) కదం తొక్కారు. పెద్ద ఎత్తున కర్షకులు (Farmers protest హస్తినకు తరలివచ్చారు. ట్రాక్టర్లతో ర్యాలీగా బయల్దేరి వచ్చారు.
బుల్లెట్ రైలు (Bullet Train) గురించి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Ashwini Vaishnaw) ఆసక్తికర ట్వీట్ చేశారు. మోడీ సర్కార్ 3.0లో రాబోతుందంటూ పేర్కొన్నారు.