తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సుందరరాజన్ బీజేపీలో చేరారు. బుధవారం చెన్నైలో ఆమె కమలం పార్టీలో చేరారు. తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సమక్షంలో తమిళిసై పువ్వు పార్టీలో చేరారు.
దేశంలోనే అతిపెద్దదైన తీహార్ జైలులో ఖైదీల ఆగడాలకు అడ్డుకట్ట వేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఖైదీలు జైలు లోపల ఫోన్ల వినియోగాన్ని నిరోధించేందుకు ఆరు చోట్ల 15 జామర్లను పెడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మంగళవారం కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి నాగ్‌పాల్ అనూహ్యంగా బదిలీ అయ్యారు.
పశ్చిమ బెంగాల్లో పోటీ చేసే అభ్యర్థులను కాంగ్రెస్ ఖరారు చేసింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సీఈసీ సమావేశంలో 12 మంది లోక్‌సభ అభ్యర్థుల పేర్లను ఎంపిక చేసింది.
హర్యానాలో ముఖ్యమంత్రి నయబ్ సింగ్ సైనీ తన కేబినెట్‌ను విస్తరించారు. మంగళవారం తొలిసారి తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కొత్తగా 8 మంది ఎమ్మెల్యేలను మంత్రులుగా తన క్యాబినెట్లోకి తీసుకున్నారు.