టెలికామ్ రెగ్యూలేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో సిమ్ కార్డు కొనుగోలుదారుల కోసం కొత్త నిబంధనలు విధించింది. ట్రాయ్ తీసుకువచ్చిన ఈ రూల్స్ జులై 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి.
సార్వత్రిక ఎన్నికల వేళ ఆయా పార్టీల నుంచి నేతలు ఇటు అటు జంప్ అవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడడం.. ఇంకోవైపు టికెట్లు లభించకపోవడంతో నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి మారిపోతున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన పరుచూరి అభిజిత్ (20) అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గతేడాది బోస్టన్ యూనివర్సిటీలో చేరాడు. తన స్నేహితులతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నాడు.
రష్యా అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైన వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు తెలియజేశారు. వరుసగా ఐదోసారి రష్యా అధ్యక్షుడిగా పుతిన్ గెలుపొందారు. ఈ మేరకు ‘ఎక్స్’ ట్విట్టర్ వేదికగా పుతిన్‌కు మోడీ విషెస్ చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాలే లక్ష్యంగా ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత కొద్దిరోజులుగా కేరళ, ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో మోడీ సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బహుజన సమాజ్‌వాదీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఆ ఎంపీ సంగీతా ఆజాద్ బీజేపీ గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.
పొరుగు దేశంపై పాకిస్థాన్ ప్రతీకార చర్యలకు పూనుకుంది. ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడికి పాకిస్థాన్ ప్రతీకారం తీర్చుకొంది. ఆఫ్ఘనిస్తాన్‌లో రెండు ప్రాంతాలపై వైమానిక దాడులు చేసింది.
బీహార్ ఎన్డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. కూటమిలో ఉన్న బీజేపీ, జేడీయూ, లోక్‌జన శక్తి పార్టీల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. ఈ మేరకు సీట్ల పంపకాలు ఖరారైనట్లు జేడీయూ వెల్లడించింది.