భారత్లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నిన ఇద్దర ఉగ్రవాదులను అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా భారత్లోకి ప్రవేశిస్తుండగా ఐఎస్ఐఎస్కు చెందిన ఇద్దరు ముష్కరులను అదుపులోకి తీసుకున్నారు.
గత వారం నుంచి దేశ వ్యాప్తంతా ఆయా రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని చోట్ల గాలివానతో పాటు వడగండ్ల వర్షం కురుస్తోంది. దీంతో ఆస్తి, ప్రాణనష్టాలు కూడా జరిగాయి.
ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు జగ్గీవాసుదేవ్కు బ్రెయిన్ సర్జరీ జరిగింది. హఠాహత్తుగా ఆయనకు ఆరోగ్యం సీరియస్ కావడంతో హుటాహుటిన ఢిల్లీలోని అపోలో ఆస్పత్రికి తరలించారు.
ప్రముఖ సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాగ్రామ్లో అంతరాయం ఏర్పడింది. సాంకేతిక కారణం చేత సర్వీసుల్లో ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీంతో యూజర్లు అయోమయానికి గురవుతున్నారు
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరగుతున్న ప్రధాని మోడీ విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రెండు రోజుల టూర్ ఖరారైంది. మార్చి 21, 22 తేదీల్లో ప్రధాని మోడీ భూటాన్లో పర్యటించనున్నారు.
సొంత పార్టీపైనే విమర్శలు గుప్పించడంతో వరుణ్ గాంధీ పొలిటికల్ కెరీర్ ఇరాటకంలో పడింది. ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు.
సార్వత్రిక ఎన్నికల వేళ బీహార్లో ఒక్కసారిగా బలహీన పడ్డ కాంగ్రెస్.. ప్రస్తుతం అనూహ్యంగా కొత్త జోష్ వచ్చింది. ప్రాంతీయ పార్టీ అయిన జన్ అధికార్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అయ్యింది.