కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర పనులు చేస్తోందని మండిపడ్డారు.
సార్వత్రిక ఎన్నికల వేళ తమిళనాడులో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. అధికార-ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. తాజాగా తమిళనాడులో అధికార డీఎంకే మంత్రి రాధాకృష్ణన్.. ప్రధాని మోడీపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే చెలరేగింది.
మొత్తానికి కర్ణాటకలో బీజేపీ-జేడీఎస్ మధ్య పొత్తు కుదిరింది. అలాగే సీట్ల పంకాలు కూడా ఖరారయ్యాయి. మొత్తం కర్ణాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ 25 సీట్లలో, జేడీఎస్ 3 సీట్లలో పోటీ చేయనున్నాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు హైకోర్టులో మళ్లీ చుక్కెదురైంది. అరెస్ట్, ఈడీ కస్టడీపై ఆదివారం లోపు అత్యవసర విచారణ జరపాలంటూ హైకోర్టులో కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల వేళ ఉల్లి ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు నిషేధం కొనసాగుతుందని వాణిజ్య మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
మాస్కోలో జరిగిన ఉగ్రదాడిని రష్యా అధ్యక్షుడు పుతిన్ తీవ్రంగా ఖండించారు. కాన్సర్ట్ హాల్లో జరిగిన దాడిలో 150 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనను ఆయన అనాగరిక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.
ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తాజాగా హైకోర్టును ఆశ్రయించారు. అరెస్ట్, ఈడీ విధించిన రిమాండ్‌ను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు.