kalpana soren: కేజ్రీవాల్ సతీమణితో కల్పనా సోరెన్ సంభాషణ.. ఏం సలహా ఇచ్చారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుతం సునీతా కేజ్రీవాల్ ఎదుర్కొంటున్న సమస్యలను స్నేహితురాలిగా తాను అర్థం చేసుకుంటున్నానని కల్పనా సోరెన్ తెలిపారు. మనీలాండరింగ్ కేసులో ఆమె భర్త, జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను కూడా జనవరిలో ఈడీ అరెస్ట్ చేసింది. తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్ సతీమణి సునీతాతో కల్పనా సోరెన్ సంభాషించారు. సునీతాకు ధైర్యం చెప్పారు. ఆమె సమస్యలను తాను అర్థం చేసుకోగలనని ఆమె ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్టు చేసింది. అనంతరం మార్చి 28 వరకు కోర్టు రిమాండ్ విధించింది. ఈ పరిణామాల నేపథ్యంలో జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ భార్య కల్పనా సోరెన్ శనివారం అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్‌తో మాట్లాడారు. సునీతాకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించానని కల్పన తెలిపారు. స్నేహితురాలిగా ఆమె సమస్యలను అర్థం చేసుకోగలనని ఆమె తెలిపారు.
Also Read
ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికైన ముఖ్యమంత్రులను అక్రమంగా అరెస్టు చేయడం సరైంది కాదని.. అది కూడా దేశంలో సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత.. ఇలాంటి ఘటనలు దారుణం అని కల్పనా సోరెన్ పేర్కొన్నారు. ఈ సంక్షోభ సమయంలో కేజ్రీవాల్‌కు తమ కుటుంబం అండగా నిలుస్తుందని కల్పన తెలిపారు.
గత జనవరిలో మనీలాండరింగ్ కేసులో హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుం ఆయన జైల్లో ఉన్నారు. ఇప్పటి వరకు బెయిల్ లభించలేదు. ఇక హేమంత్ సోరెన్ వారసుడిగా చంపయ్ సోరెన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉంటే ఇటీవలే హేమంత్ వదిన సీతా సోరెన్.. బీజేపీలో చేరారు.
ఇది కూడా చదవండి: Hardeep Puri: ఇంధన ధరల తగ్గింపుపై కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
अभी अरविंद केजरीवाल जी की धर्म पत्नी सुनीता केजरीवाल जी से बात कर उन्हें साहस देने का प्रयास किया। एक साथी के रूप में मैं उनकी परेशानियों को समझ सकती हूं।
लोकप्रिय निर्वाचित मुख्यमंत्रियों की गैरकानूनी ढंग से गिरफ्तारी और वह भी तब जब देश में आम चुनाव के कार्यक्रम की घोषणा हो गई…
— Hemant Soren (@HemantSorenJMM) March 23, 2024
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!