ఈ మధ్య బంగారం ధరలు హెచ్చు తగ్గులు అవుతున్నాయి. ఒక్కోసారి అమాంతంగా పెరిగిపోతుంది. మరొక రోజు తగ్గుతుంది. ఇలా గోల్డ్ లవర్స్‌ను ధరలు ఊగిసలాటడిస్తున్నాయి. ఆ మధ్య కాలంలో భారీగా ధరలు పెరిగిపోయాయి. దీపావళి తర్వాత తగ్గుతాయేమోనని భావించారు. కానీ అంతగా ఊరట ఏం లభించలేదు. ఇదిలా ఉంటే నిన్న భారీగా పెరిగిన ధరలు.. ఈరోజు మాత్రం కాస్త ఉపశమనం కలిగించింది. తులం గోల్డ్‌పై రూ.280 తగ్గగా.. కిలో సిల్వర్‌పై మాత్రం రూ.1,000 పెరిగింది.
ఇది కూడా చదవండి: Prashant Kishor: జన్ సురాజ్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పేసిన ప్రశాంత్ కిషోర్
24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.280 తగ్గి.. రూ.1, 23, 000 దగ్గర అమ్ముడవుతుండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 250 తగ్గి.. రూ. 1, 12, 750 దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.210 తగ్గి.. రూ.92, 250 దగ్గర అమ్ముడవుతోంది.
ఇది కూడా చదవండి: Israel-Gaza: ఖైదీల వీడియో లీక్.. ఇజ్రాయెల్ టాప్ అడ్వకేట్ జనరల్ మేజర్ రాజీనామా
ఇక వెండి ధర మాత్రం శనివారం రూ.1,000 పెరిగింది. ఈరోజు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.1,52,000గా అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.1,66,000గా కొనసాగుతోంది. దేశంలోని ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, బెంగళూరులో రూ.1,52,000గా ట్రేడ్ అవుతోంది.
ఇది కూడా చదవండి: Bengaluru: దారుణం.. అబ్బాయితో తిరగొద్దన్న పాపానికి తల్లిని చంపిన కుమార్తె