బీహార్ తొలి దశ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ అగ్ర నేత కీలక ప్రజెంటేషన్ ఇచ్చారు. గత ఎన్నికల్లో ఓట్ల దొంగతనం జరిగిందంటూ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. హర్యానాలో కాంగ్రెస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని.. తీరా ఫలితాల సమయానికి అంతా తారుమారు చేశారని ఆరోపించారు.
బీహార్‌లో తొలి విడత సమరానికి సిద్ధమైంది. గురువారం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో మొదటి విడతగా పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్నికల సిబ్బంది కూడా ఆయా బూత్‌లకు తరలివెళ్తున్నారు.
న్యూయార్క్ మేయర్‌గా జోహ్రాన్ మమ్దానీ భారీ విజయం సాధించారు. న్యూయార్క్‌కు తొలి ముస్లిం మేయర్‌గా చరిత్ర సృష్టించారు. అది కూడా 34 ఏళ్ల వయసులో న్యూయార్క్ మేయర్ కావడం శతాబ్ద కాలంలో ఇదే మొదటిసారి. మమ్దానీ విజయం వెనుక చాలా చరిత్రనే ఉంది. ఇతడు ఇండియన్-అమెరికన్ కావడం కూడా విశేషం.
ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రైలు ట్రాక్ దాటుతుండగా ఒక్కసారిగా రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు.
కార్తిక పౌర్ణమి రోజున పసిడి ప్రియులకు శుభవార్త. పండుగ పూట ధరలు భారీగా దిగొచ్చాయి. గత కొద్దిరోజులుగా హెచ్చు తగ్గులుగా ఉంటున్న ధరలు.. ఈ వారంలో మాత్రం కాస్త ఉపశమనం కలిగించాయి. నిన్న స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈరోజు మాత్రం భారీగా తగ్గాయి. తులం గోల్డ్‌పై రూ.980 తగ్గగా.. కిలో వెండిపై మాత్రం రూ.500 తగ్గింది.
అమెరికాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏడాది పాలనలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. న్యూయార్క్ మేయర్ పదవితో పాటు వర్జీనియా, న్యూజెర్సీ గవర్నర్ పదవులన్నీ డెమోక్రాటిక్ పార్టీ కైవసం చేసుకుంది.
ట్రంప్‌కు అమెరికన్లు గట్టి షాకిచ్చారు. స్థానిక ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది. ఏడాది పాలనలోనే ట్రంప్ తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. తాజాగా జరిగిన స్థానిక ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
అగ్ర రాజ్యం అమెరికాలో జరుగుతున్న స్థానిక ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. అన్ని చోట్ల డెమోక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థులు విజయం దిశగా దూసుకుపోయారు. రిపబ్లికన్ పార్టీ చతికిలపడింది.
ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. సులవేసి ద్వీపంలో 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. బుధవారం సులవేసి ఉత్తర తీరంలో భూకంపం సంభవించిందని ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ (BMKG) తెలిపింది.
అమెరికాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. లూయిస్విల్లే విమానాశ్రయం సమీపంలో కార్గో విమానం కూలిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. 11 మందికి గాయాలయ్యాయి. విమానం కూలిపోగానే మంటలు పెద్ద ఎత్తున విస్తరించాయి.