కంగనా రనౌత్‌పై కాంగ్రెస్ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలు మండీ, హిమాచల్‌ప్రదేశ్‌కే అవమానకరమని.. వారికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రజలకు పిలుపునిచ్చారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మండీ నియోజకవర్గంలో మోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక్కడ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించగానే పలువురు నెగిటివ్ కామెంట్లు చేశారు. దీంతో పెద్ద దుమారమే చెలరేగింది. ఎన్నికల సంఘం, మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. తాజాగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ అంశాన్ని ప్రధాని గుర్తుచేశారు.

కంగనాపై కాంగ్రెస్ నేతలు ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు మండీ, హిమాచల్‌ప్రదేశ్‌కే అవమానకరమని, దీనికి ఓటర్లు తగిన సమాధానం చెప్పాలన్నారు. కంగనా మీ గొంతుకగా మారతారని, మండీ అభివృద్ధికి పాటుపడతారని హామీ ఇచ్చారు. ఇక అయోధ్యలో రామాలయాన్ని నిర్మించాలన్న తీర్మానాన్ని బీజేపీ జాతీయ కార్యవర్గం 1989లో హిమాచల్‌ప్రదేశ్‌లోనే ఆమోదించిందని మోడీ తెలిపారు. రామమందిర నిర్మాణానికి ఇది సంకల్పభూమి అని పేర్కొన్నారు.
ఇక ప్రధాని మోడీ మండీ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా కంగనా రనౌత్… ప్రధానికి గులాబీ పువ్వుతో స్వాగతం పలికారు. ఈ మేరకు ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఫొటోలు షేర్ చేశారు. ప్రధాని మోడీ స్టేజ్ మీదకు రాగానే నమస్కారం చేసి ఎర్ర గులాబీని అందజేశారు. సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ… మండీకి స్వాగతం అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ఇక కంగనా రనౌత్ క్రీమ్ చీరతో హిమాచలీ టోపీని ధరించారు. ఇక ఈ కార్యక్రమానికి స్థానికులు భారీగా తరలివచ్చినట్లు కంగనా ఫొటోలు పంచుకున్నారు. ఈ పోస్ట్‌పై ఓ అభిమాని చాలా అద్భుతం అని వ్యాఖ్యానించారు.
దేశ వ్యాప్తంగా ఏడు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఐదు దశల పోలింగ్ ముగిసింది. ఆరో విడత శనివారం జరగనుంది. చివరి విడత జూన్ 1న జరగనుంది. మండీ నియోజకవర్గానికి కూడా జూన్ 1న పోలింగ్ జరగనుంది. ఇక ఎన్నికల ఫలితాలు మాత్రం జూన్ 4న విడుదల కానున్నాయి.