మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ఇక ఎన్డీఏ పక్ష నేతగా మోడీని ఎన్నుకున్నారు.
త్వరలోనే కేంద్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది. మోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడనుంది. ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈనెల 9న సాయంత్రం 6 గంటలకు కొత్త ప్రభుత్వం ఏర్పడనుంది.
స్టాక్ మార్కెట్లో హెరిటేజ్ ఫుడ్‌కు కాసుల పంట మొదలైంది. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం పార్టీ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అత్యధిక సీట్లను సొంతం చేసుకోవడమే కాకుండా.. రాష్ట్రంలోనూ.. కేంద్రంలోనూ చంద్రబాబు కింగ్ మేకర్‌గా నిలిచారు.
ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు.
రష్యాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. నదిలో మునిగి నలుగురు భారతీయ వైద్య విద్యార్థులు మరణించారు. ఒకరు రక్షించబడ్డారు. దీంతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.
దేశానికి మరింత సేవ చేయాలని ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును ఎన్డీఏ నేతలు భేటీ అయి తీర్మాన పత్రాన్ని అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరగా.. అందుకు అంగీకారం తెలిపింది.
రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నరేంద్ర మోడీ, ఎన్డీయే మిత్రపక్షాలు సమావేశం అయ్యాయి. ఈ సందర్భంగా ఎన్డీఏ చేసిన తీర్మానాన్ని రాష్ట్రపతికి మోడీ అందజేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని రాష్ట్రపతిని మోడీ కోరారు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో తల్లి భవానీ రేవణ్ణకు ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు అయింది. కిడ్నాప్ కేసులో ప్రజ్వల్ తల్లి భవానీ రేవణ్ణ శుక్రవారం సిట్ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. ఇక కేసులో కర్ణాటక హైకోర్టు ఆమెకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.