ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణ్‌పూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందారు. ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. ఏప్రిల్ 30న నారాయణ్‌పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో పది మంది మావోలు చనిపోగా.. వారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో 29 మంది మరణించారు. ఇక శుక్రవారం నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు నక్సలైట్లు మరణించగా.. ముగ్గురు జవాన్లు గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన డిప్యూటీ సీఎం భట్టి..
ఓర్చా ప్రాంతంలోని గోబెల్ గ్రామ సమీపంలోని అడవిలో ఈ కాల్పులు జరిగాయని పోలీసులు పేర్కొన్నారు. భద్రతా సిబ్బంది… ఉమ్మడి నక్సలైట్ వ్యతిరేక బృందం ఆపరేషన్‌లో ఉన్నారని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. నారాయణపూర్, కొండగావ్, దంతేవాడ మరియు బస్తర్ జిల్లాలకు చెందిన పోలీసుల జిల్లా రిజర్వ్ గార్డ్‌కు చెందిన సిబ్బంది, ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ 45వ బెటాలియన్ ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు ఆయన చెప్పారు.
కాల్పుల తర్వాత ఐదుగురు మృతదేహాలు, కొన్ని ఆయుధాలు సంఘటన స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు కూడా గాయపడ్డారని.. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందన్నారు. ఈ ఘటనతో 122 మంది నక్సలైట్లు ఈ ఏడాదిలో మరణించారు.
ఇది కూడా చదవండి: PM Modi: ప్రమాణస్వీకారం తర్వాత మోడీ పర్యటన ఈ దేశాల్లోనే..