ఆదివారం మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7:15 నిమిషాలకు రాష్ట్రపతి భవన్లో ఈ కార్యక్రమం జరగనుంది. ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు. అయితే ఈ ప్రమాణస్వీకారానికి విపక్ష పార్టీలను ఇప్పటి వరకు ఆహ్వానించలేదు.
సోనియాగాంధీ మరోసారి కీలక బాధ్యతలు చేపట్టబోతున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీ ఎంపికయ్యారు. 2024, జూన్ 8వ తేదీ శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.
మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్న తరుణంలో దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీలోని షాహీన్ బాగ్ ప్రాంతంలోని ఓ రెస్టారెంట్లో మంటలు చెలరేగాయి.
మహారాష్ట్ర బీజేపీలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు తర్వాత బీజేపీ గ్రాఫ్ పడిపోవడం.. తక్కువ సీట్లు రావడంతో డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ రాజీనామాకు సిద్ధమయ్యారు.
తెలంగాణ సహా 12 రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయని ఐఎండీ తెలిపింది.
ఎయిర్ కెనడాకు భారీ ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులతో పాటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఎయిర్ కెనడాకు చెందిన బోయింగ్ ఏసీ 872 విమానం జూన్ 5న కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అవుతుండగా విమానంలో కుడివైపు ఇంజిన్‌లో పేలుడు సంభవించింది.
నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఢిల్లీ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆమెకు భారీ ఘన స్వాగతం లభించింది. మోడీ ముచ్చటగా మూడోసారి ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు
బెంగాల్ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సోహమ్ చక్రవర్తి రెస్టారెంట్లో రెచ్చిపోయారు. సిబ్బంది పట్ల దురుసుగా ప్రవర్తించారు. రెస్టారెంట్ దగ్గర పార్కింగ్ సమస్య తలెత్తింది. ఈ సందర్భంగా రెస్టారెంట్ యజమానిని చెంపదెబ్బ కొట్టారు.
బాలీవుడ్ నటి, మండీ లోక్‌సభ ఎంపీ కంగనా రనౌత్‌కు రాజకీయ ప్రముఖుల నుంచి మద్దతు లభిస్తోంది. ఇటీవల చండీగఢ్ ఎయిర్‌పోర్టులో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్.. కంగనాను చెంప దెబ్బ కొట్టింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
నరేంద్ర మోడీ.. దేశ ప్రధానిగా మూడోసారి ఆదివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 7:30 గంటలకు రాష్ట్రపతి భవన్లో ప్రధానిగా మోడీ ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మోడీచే ప్రమాణం చేయించనున్నారు.