రాహుల్‌గాంధీ కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. ఈరోజే తన నిర్ణయాన్ని లోక్‌సభ సచివాలయానికి తెలియజేయనున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్.. రాయ్‌బరేలీ, వయనాడ్ నుంచి పోటీ చేసి భారీ విజయాన్ని అందుకున్నారు.
ఆ తండ్రి.. తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు గ్రాండ్‌గా చేయాలని భావించాడు. అందుకు తగినట్టుగా వివాహ ఏర్పాట్లు చేశాడు. పెళ్లి కార్డులు పంచాడు. బంధువుల్ని పిలిచాడు. ఇంకోవైపు వివాహ ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి.
స్విట్జర్లాండ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్‌లో శాంతికి సంబంధించిన ఉమ్మడి ప్రకటనపై సంతకం చేయడానికి భారత్ వెనుకడుగు వేసింది. ఈ శిఖరాగ్ర సమావేశానికి రష్యా హాజరు కాకూడదని నిర్ణయించుకుంది.
కువైట్ అగ్నిప్రమాదంలో 46 మంది భారతీయులు సహా మొత్తం 50 మంది ప్రాణాలు కోల్పోయారు. పదులకొద్ది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ప్రమాదంలో పొగ పీల్చి అక్కడిJక్కడే మెట్లపై ప్రాణాలు కోల్పోయారు.
దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఇందులో కేవలం సీట్లు మాత్రమే ఉంటాయి. అత్యంత వేగంగా.. తక్కువ సమయంలో గమ్యానికి చేరుస్తుంటాయి. అయితే త్వరలో వందేభారత్ స్లీపర్ కూడా పట్టాలపై పరుగులు పెట్టనుంది.
త్వరలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఇటీవల విడుదలైన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో మరోసారి ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మోడీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు.
పూణె కారు ప్రమాదం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. మద్యం మత్తులో మైనర్ కారు నడిపి ఇద్దరు టెకీల ప్రాణాలు తీశాడు. అనంతరం గంటల వ్యవధిలోనే మైనర్ నిందితుడికి బెయిల్ రావడం.. అలాగే ప్రమాదంపై వ్యాసం రాసుకుని రమ్మని చెప్పడం.. ఇదంతా తీవ్ర దుమారం చెలరేగింది.
రైల్వే ప్రయాణమంటే ఎలా ఉంటుందో చాలా మందికి అనుభవమే. కిక్కిరిసిన ప్రయాణికులు.. డోర్ల దగ్గర వ్రేలాడడం వంటి సీన్లు కనిపిస్తుంటాయి. జనరల్ బోగీల్లో కనీసం నిలబడేందుకు కూడా చోటు లేక ఇబ్బందులు పడుతుంటారు.
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో భారీ అగ్ని్ప్రమాదం సంభవించింది. అత్యంత భద్రతతో కూడిన సచివాలయ సముదాయం సమీపంలోని భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవనం ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అధికారిక బంగ్లాకు కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న బంగ్లాలో మంటలు ఎగిసిపడ్డాయి.
బ్రిటీష్ యువరాణి కేట్ మిడిల్టన్ ప్రత్యక్షమైంది. చాలా రోజుల తర్వాత ఆమె పబ్లిక్కు దర్శనమిచ్చారు. దీంతో గత కొద్ది రోజులుగా ప్రజల్లో ఉన్న అనుమానాలకు తెరపడింది. గత జనవరి నుంచి కేట్ మిడిల్టన్ ప్రజలకు ప్రత్యక్షం కాలేదు.