Lucknow hospital: ఐసీయూలో తండ్రి.. కూతుళ్లిద్దరూ ఏం చేశారంటే..!
- లక్నో ఆస్పత్రి ఐసీయూలో పెళ్లి
- కోమాలో ఉన్న తండ్రి ఎదుట కూతుళ్ల మ్యారేజ్
- తండ్రి కోసం ఐసీయూలోనే చేసుకున్న కూతుళ్లు
- సోషల్ మీడియాలో ఫొటోలు.. వీడియోలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ తండ్రి.. తన ఇద్దరు కూతుళ్లకు వివాహాలు గ్రాండ్‌గా చేయాలని భావించాడు. అందుకు తగినట్టుగా వివాహ ఏర్పాట్లు చేశాడు. పెళ్లి కార్డులు పంచాడు. బంధువుల్ని పిలిచాడు. ఇంకోవైపు వివాహ ఏర్పాట్లు కూడా చకచకా జరుగుతున్నాయి. ఇల్లంతా సందడి.. సందడిగా ఉంది. అయితే ఏమైందో ఏమో తెలియదు గానీ.. అంతలోనే ఊహించని పరిణామం ఆ కుటుంబాన్ని దు:ఖంలో పడేసింది. ఉన్నట్టుండి ఆ తండ్రికి ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో విలవిలలాడిపోయాడు. హుటాహుటినా కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం లక్నో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అంతే తన తండ్రిని సంతోష పెట్టేందుకు ఐసీయూలోనే వివాహం చేసుకుని కోరిక నెరవేర్చారు.
ఇది కూడా చదవండి: NCERT Chief: ‘భారత్’, ‘ఇండియా’లను పాఠ్యపుస్తకాల్లో పరస్పరం మార్చుకోవాలి..
Also Read
లక్నోకు చెందిన 51 ఏళ్ల సయ్యద్ జునైద్ ఇక్బాల్ తన కూతుళ్లకు ఈనెల 22న ముంబైలో వివాహం చేయాలని ఏర్పాట్లు చేసుకున్నాడు. కానీ ఇంతలోనే అతడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తీవ్రమైన ఛాతీ నొప్పితో ఐసీయూలో ఉన్నాడు. వైద్యుల సూచన మేరకు.. తన తండ్రిని సంతోష పెట్టేందుకు ఆ కూతురులిద్దరూ ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ముస్లిం సాంప్రదాయ ప్రకారం ఐసీయూలో తండ్రి ఎదుటే నికా జరిగించారు. ఆస్పత్రికి సంబంధించిన దుస్తులు ధరించి గురువారం వివాహం చేసుకోగా.. శుక్రవారం బంధువులకు విందు ఏర్పాటు చేసి ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఐసీయూ యూనిఫాం ధరించిన వివాహ జంటల ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇది కూడా చదవండి: Vijay Sethupathi: హిట్ కొట్టగానే డైరెక్టర్ మారిపోయాడు.. 33 సార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు!
Unique marriage took place with simplicity and rituals in the ICU of Era Hospital, #Lucknow !
Father admitted in ICU got his daughters married in front of hi. pic.twitter.com/rFJIhRCpsK— Nuzba Amen Sheakh (@nuzzu52103) June 16, 2024
తాజావార్తలు
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!