మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అత్యంత భద్రతతో కూడిన సచివాలయ సముదాయం సమీపంలోని భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ భవనం ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ అధికారిక బంగ్లాకు కొన్ని వందల మీటర్ల దూరంలో ఉన్న బంగ్లాలో మంటలు ఎగిసిపడ్డాయి. భారీ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న నాలుగు అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని పోలీసులు తెలిపారు.